P Krishna
Woman of Heart Attack in Bus: ఇటీవల హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. చిన్న పెద్ద అనే వయసుతో నిమిత్తం లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూస్తున్నారు.
Woman of Heart Attack in Bus: ఇటీవల హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. చిన్న పెద్ద అనే వయసుతో నిమిత్తం లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూస్తున్నారు.
P Krishna
ఈ మధ్య కాలంలో ఆకస్మిక గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న వయసు నుంచి ముదుసలి వరకు గుండెపోటుతో మృత్యువాతపడుతున్నారు. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించి.. సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా హార్ట్ ఎటాక్ కి గురై కన్నుమూస్తున్నారు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు కొన్ని అయితే.. టెన్షన్, అదిగా వ్యాయామం చేయడం, పెద్ద పెద్ద శబ్ధాలకు డ్యాన్స్ లు చేయడం, అనారోగ్య సమస్యల కారణంగా హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఉపాది కోసం పరాయి దేశం వెళ్లి తిరిగి వస్తున్న ఓ మహిళ హార్ట్ ఎటాక్ కి గురైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉపాధి కోసం కొంత కాలం క్రితం ఓ మహిళ మస్కట్ కి వెళ్లింది. చాలా కాలం తర్వాత తన కుటుంబ సభ్యులను కలిసి సంతోషంగా గడిపేందుకు మస్కట్ నుంచి బయలుదేరింది. మస్కట్ నుంచి బయలుదేరే ముందు కూడా కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా మాట్లాడింది. మస్కట్ నుంచి విజయవాడ చేరుకొని అక్కడ నుంచి స్వస్థలం కోరుమామిడికి ఆర్టీసీ బస్సులో బయలేదేరింది. బస్సులో ఒక్కసారే గుండెపోటు రావడంతో సీట్లోనే కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
భారత దేశం నుంచి చాలా మంది మస్కట్, కువైట్, సౌదీ దేశాలకు ఉపాది నిమిత్తం వెళ్తుంటారు. అక్కడ కొంత డబ్బు సంపాదించుకున్న తర్వాత తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు భారత్ తిరిగి వస్తారు. కుటుంబం కోసం తమ సుఖ సంతోషాలను దూరంగా పెట్టి ఎంతోమంది పురుషులు, స్త్రీలు పరాయిదేశాలకు వెళ్లి కష్టపడి సంపాదింస్తుంటారు. తన కుటుంబం బాగుండాలి అని ఆశతో మస్కట్ వెళ్లి కొంత డబ్బు వెనుకేసుకున్న తర్వాత తనవాళ్లతో సంతోషంగా ఉండాలని తిరిగి వస్తున్న మహిళ హఠాత్తుగా గుండెపోటుతో మృత్యువడిలోకి చేరుకోవడం అటు కుటుంబ సభ్యులనే కాదు.. గ్రామస్థులు సైతం కంటతడి పెట్టుకున్నారు.