అచ్చం iPhoneలా.. వెడ్డింగ్ కార్డు ఐడియా అదుర్స్..

iPhone Themed Wedding Card: మనిషికి సృజనాత్మకత ఉంటే ఎలాంటి అద్భుతాలైనా సృష్టించ వొచ్చు అని ఎంతోమంది నిరూపించారు. ఓ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటో చూద్దాం..

iPhone Themed Wedding Card: మనిషికి సృజనాత్మకత ఉంటే ఎలాంటి అద్భుతాలైనా సృష్టించ వొచ్చు అని ఎంతోమంది నిరూపించారు. ఓ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటో చూద్దాం..

ఈ మధ్య యువత చాలా మంది తమ అభిరుచులకు తగ్గట్టుగా భాగస్వామిని ఎన్నుకుంటున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కాకుండా తమకు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అంతేకాదు ప్రీ వెడ్డింగ్ షూట్ మొదలు పెళ్లి తంతు పూర్తయ్యే వరకు అంతా గ్రాండ్ గా వెరైటీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వివాహబంధం ఎంతో పవిత్రమైనది.. అలాంటి పెళ్లి జీవితాంతం గుర్తుండి పోయేలా ప్లాన్ చేస్తున్నారు.తమ స్థాయికి తగ్గట్టు పెళ్లి వేడుకులు జరుపుతున్నారు. ఇక పెళ్లికి ముందు వెడ్డింగ్ కార్డు కూడా ఎంతో సృజనాత్మకంగా ఉండేలా చూస్తున్నారు. అలాంటి ఓ వెడ్డింగ్ కార్డు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల తమ తమ స్థాయికి తగ్గట్టు పెళ్లి వేడుకలు గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. వెడ్డింగ్ కార్డు కేవలం ఇన్విటేషన్ గా మాత్రమే కాదు.. దంపతుల అభిరుచి‌కి తగ్గట్టు ప్లాన్ చేస్తున్నారు.. తమ వెడ్డింగ్ కార్డు ఎప్పటికీ గుర్తుండిపోయేలా డిజైన్ చేయిస్తున్నారు.ఈ మధ్య పెళ్లిళ్ల సమయంలో ఫ్యాన్సీ, కస్టమైజ్‌డ్ వెడ్డింగ్ కార్డులు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. కాలానికి అనుగుణంగా, విశాఖపట్నంలో ఓ జంట ఐఫోన్ బ్యాగ్ గ్రౌండ్ మాదిరిగా ప్రత్యేకమైన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు రూపొందించారు. ప్రస్తుతం ఈ వెడ్డి కార్డు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. అచ్చం ఐఫోన్ మాదిరిగా ఉందే అంటూ తెగ లైకులు కొట్టేస్తున్నారు. లక్ష్మణ్ వెడ్డింగ్ కార్డ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ వెడ్డింగ్ కార్డు అచ్చం ఐఫోన్ ని పోలినట్లు కనిపిస్తుంది. మొత్తం మూడు పేజీల్లో బుక్ లెట్ డిజైన్ లే అవుట్ తో రూపొందించారు.

కవర్ పేజీలో ఫోన్ వాల్ పేపర్ మాదిరిగా జంట ఫోనును డిజైన్ చేశారు. ఫోటో పై వివాహ తేది, సమయం ప్రింట్ చేశారు. లోపల ఇన్విటేషన్ పేజీల్లలో మధ్య పేజీ వాట్సాప్ చాట్ మెసేజన్ లో డిజైన్ చేశారు. ఇరు ప్రక్కల వేదిక వివరాలు, లొకేషన్స్ ఉన్నాయి. ఇన్విటేషన్ బ్యాక్ కవర్ పై 3డి మాదిరగా కెమెరాను డిజైన్ చేశారు. ఈ వీడియో ఇప్పటి వరకు 15 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ వీడియోపై రక రకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఐడియాలు మీకు ఎలా వస్తాయి బ్రదర్ అంటూ కామెంట్స్ చేయగా, ఓ యూజర్ ఇలాంటి కాస్ల్టీ వెడ్డింగ్ నేనూ చేయించుకుంటా అంటూ చమత్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Show comments