కాణిపాకం గణపయ్యకు భారీ విరాళం.. ఏకంగా 6 కిలోల బంగారు బిస్కెట్లు ఇచ్చిన ఇద్దరు భక్తులు

కాణిపాకం గణపయ్యకు భారీ విరాళం.. ఏకంగా 6 కిలోల బంగారు బిస్కెట్లు ఇచ్చిన ఇద్దరు భక్తులు

కాణిపాకం గణపయ్యకు భారీగా బంగారాన్ని విరాళంగా ఇచ్చారు ఇద్దరు భక్తులు. ఏకంగా 6 కిలోల బంగారు బిస్కెట్లు ఇచ్చి వినాయకుడిపై ఉన్న భక్తిని చాటుకున్నారు ఆ భక్తులు.

కాణిపాకం గణపయ్యకు భారీగా బంగారాన్ని విరాళంగా ఇచ్చారు ఇద్దరు భక్తులు. ఏకంగా 6 కిలోల బంగారు బిస్కెట్లు ఇచ్చి వినాయకుడిపై ఉన్న భక్తిని చాటుకున్నారు ఆ భక్తులు.

విజ్ఞాలను తొలగించి అన్ని పనుల్లో విజయాలను అందించే గణపయ్యను భక్తులు ఎంతో నిష్టతో పూజిస్తారు. వినాయకుడిని పూజిస్తే అన్నీ శుభాలే జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గణపతి నవరాత్రుల్లో ప్రతీ ఊరు, ప్రతీ గడప, ప్రతీ వాడ లంబోధరుడి నామస్మరణతో మారుమ్రోగిపోతుంటుంది. సకల దేవతల కంటే ముందుగా కొలిచేది విఘ్నేశ్వరుడినే. గణేషుడికి తొలి పూజలు చేసి ఆశీర్వాదం పొందితే కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. కోరిన కోర్కెలు తీర్చే గణపయ్యకు భక్తులు తమకు తోచిన కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో ఓ ఇద్దరు భక్తులు కాణిపాకం గణపయ్యకు భారీ విరాళం అందించారు. ఏకంగా 6 కిలోల బంగారు బిస్కెట్లను విరాళంగా ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం. భక్తులకు వరాలను ఇస్తూ వరసిద్ధి వినాయకస్వామిగా విశేష పూజలను అందుకుంటున్నారు. కాణిపాక గణపయ్యను నిత్యం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. తాజాగా ఇద్దరు ఎన్నారై భక్తులు వినాయకుడికి ఆరు కిలోల బంగారు బిస్కెట్లు కానుకగా ఇచ్చారు. ఎన్నారైలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ 6 కిలోల విలువ చేసే 20 బంగారు బిస్కెట్లను గణేషుడికి విరాళంగా అందజేశారు.

ఈ బంగారాన్నంతిటినీ స్వామివారి అంతరాలయం, బంగారు వాకిలి నిర్మాణానికి ఉపయోగించునున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భారీ విరాళం అందించిన ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్‌కు ఘన స్వాగతం పలికారు ఆలయ ఈవో వెంకటేష్, చైర్మన్ మోహన్‌రెడ్డి. భారీ మొత్తంలో బంగారాన్ని విరాళంగా అందించిన ఇద్దరు భక్తులు ఆలయ అభివృద్దికి ఎల్లప్పుడూ తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. గణపయ్యకు అందిన భారీ విరాళంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show comments