Babu Face Liquor Case: బాబుపై లిక్కర్ కేసులో భారీ ట్విస్ట్! హైకోర్టు ముందు కీలక అంశాలు..

బాబుపై లిక్కర్ కేసులో భారీ ట్విస్ట్! హైకోర్టు ముందు కీలక అంశాలు..

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాబుపై ఉన్న లిక్కర్ కేసులో శుక్రవారం భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది.

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాబుపై ఉన్న లిక్కర్ కేసులో శుక్రవారం భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది.

ఇటీవల కొంతకాలం నుంచి ఏపీలో పొటిలిక్ వార్ మొత్తం నారా చంద్రబాబు నాయుడు కేసుల చుట్టే తిరుగుతుంది. కారణం.. ఆయన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు అయిన దగ్గర నుంచి  అనేక పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. కేవలం ఈ కేసు మాత్రమే కాకుండా చంద్రబాబుపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం కుంభకోణం, ఇసుక అక్రమ రవాణ, పైబర్ గ్రిడ్ వంటి కేసుల్లో ఆయన పేరును నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులన్ని వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. అయితే చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. శుక్రవారం ఈ కేసు హైకోర్టులో విచారణకు రాగా సీఐడీ తరపు న్యాయవాది కీలక విషయాలను నివేదించారు.

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య సమస్యల కారణం చూపడంతో చంద్రబాబుకు హైకోర్టు మధ్యతరం బెయిల్ ను మంజూరు చేసింది. నవంబర్ 28 వరకు ఆయన బయట ఉండేందుకు  కోర్టు షరతులతో కూడి బెయిల్ ను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసుకునే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఇది ఇలా ఉంటే  ఆయనపై వివిధ కేసులు కోర్టుల్లో విచారణ సాగుతున్నాయి.

ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ముందస్తు బెయిల్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ వేయగా.. అవి విచారణలో ఉన్నాయి. తాజాగా హైకోర్టులో లిక్కర్ స్కాం కి సంబంధించి విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీఐడీ తరపు న్యాయవాది ఏజీ ఎన్. శ్రీరామ్ కీలక విషయాలను హైకోర్టుకు నివేదించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కన్నుసన్నల్లోనే అప్పటి మద్యం కుంభకోణం జరిగిందని ఆయన తెలిపారు.

అంతేకాక మంత్రి మండలిలో చర్చించకుండానే చంద్రబాబు నాయుడు లిక్కర్ విషయంలో జీవో జారీ చేశారని వివరించారు. అలా జీవో జారీ చేయడం ద్వారా పలు బార్లకు లబ్ధి చేకూరేలా చేశారు. అలానే ఈ మద్యం కుంభకోణంలో చంద్రబాబుతో పాటు అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రమేయం కూడా ఉందని సీఐడీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇతర నిందితుల ప్రమేయం ఉందని తెలిపారు. వీరి చర్యల వల్ల రాష్ట్ర ఖజానకు రూ.1500 కోట్ల  మేర నష్టం వాటిల్లిందని కాగ్ సైతం తేల్చిందని కోర్టు దృష్టికి తెచ్చారు. స్వలాభం కోసం డిస్ట్రీలకు, బార్లకు లబ్ధి చేకూర్చేందుకు నిర్ణయాలు తీసుకున్నారని కోర్టులు తెలిపారు.

మద్యం స్కామ్ లో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు డబ్బులు ముట్టిన అంశం దర్యాప్తు జరుగుతుందని శ్రీరామ్ తెలిపారు. ఈ స్కామ్ కు సంబంధించిన అన్ని విషయాలు దర్యాప్తులో బయటపడతాయన్నారు.  ఎఫ్ఐఆర్ లో అన్ని అంశాలను పేర్కొనాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి కీలక దశలో ఎలాంటి ఉత్తర్వూలు జారీ చేయోద్దని కోర్టుకు విన్నవించారు. ఇరువైపు వాదనలు ఉన్న కోర్టు విచారణను ఈనెల 20కి విచారణ వాయిదా వేసింది. మరి.. లిక్కర్ స్కామ్ లో సీఐడీ తరపు న్యాయవాది శ్రీరామ్ కోర్టుకు చెప్పిన అంశాలపై మీఅభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments