Venkateswarlu
నంది విగ్రహం ధ్వంసం అయి ఉండటం గుర్తించిన భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నంది విగ్రహం ధ్వంసం అయి ఉండటం గుర్తించిన భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Venkateswarlu
గుప్త నిధుల వేటగాళ్లు.. నిధుల వేటలో చారిత్రక కట్టడాలను, గుళ్లను ధ్వంసం చేస్తూ ఉన్నారు. పుకార్లను ప్రామాణికంగా తీసుకుని విలువైన సంపదను నాశనం చేస్తున్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో గుప్తు నిధుల వేటగాళ్లు రెచ్చిపోయారు. ఓ గుడిలోని నంది కడుపులో వజ్రాలున్నాయన్న ప్రచారంతో వాళ్లు రంగంలోకి దిగారు. నందిని ధ్వంసం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రకాశంజిల్లా బెస్తవారిపేట మండలం పిట్టికాయగుళ్ళ గ్రామంలో ఓ పురాతన శివాలయం ఉంది.
గుప్త నిధుల వేటగాళ్ళు ఇక్కడ తవ్వకాలు జరిపారు. భక్తులు శివుడ్ని పిటికేశ్వరుడిగా కొలుస్తుంటారు. పిటికేశ్వర ఆలయ ఆవరణలో ఓ నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహంలో కోట్లు విలువ చేసే వజ్రాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతూ ఉంది. ఈ విషయం గుప్తు నిధుల వేటగాళ్లకు తెలిసింది. దీంతో వారు నంది విగ్రహంపై కన్నేశారు. రెండు రోజుల క్రితం పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. విగ్రహాన్ని తవ్వి పక్కకు తీశారు. అనంతరం నంది పొట్టను పగుల గొట్టారు. అయితే, అందులో ఏమీ దొరకలేదు.
నంది విగ్రహం ధ్వంసం అయి ఉండటం గుర్తించిన భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుప్తు నిధుల వేటగాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. చరిత్ర కలిగిన ఆలయాన్ని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. కాగా, ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం కనపర్తిలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మరి, గుప్త నిధుల కోసం దేవాలయాలను ధ్వంసం చేస్తున్న గుప్త నిధుల వేటగాళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.