Arjun Suravaram
మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. టీడీపీ అయితే గెలవాలని తీవ్రంగా కష్టపడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఓ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది
మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. టీడీపీ అయితే గెలవాలని తీవ్రంగా కష్టపడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఓ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది
Arjun Suravaram
ఏపీలో రాజకీయం చాలా హాట్ హాట్ గా ఉంటుంది. ఇక్కడ వైసీపీ, టీడీపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా.. ప్రతిపక్షంగా టీడీపీ కొనసాగుతోంది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యం ఇరుపార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. టీడీపీ అయితే గెలవాలని తీవ్రంగా కష్టపడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఓ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు ఓ అంశం విషయంలో అసంతృప్తితో రగిలిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి.. ఆ జిల్లా ఏది.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని టీడీపీ పార్టీలో కొత్త పంచాయితీ వచ్చిందని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు తరువాత పొలిటికల్ బ్యూరో స్థానంలో రాజకీయ కార్యక్రమాలకు టీడీపీ కమిటీని ఏర్పాటు చేసింది. అందులో 14 మంది సభ్యులు ఉన్నారు. అలానే జనసేనతో సమన్వయం, ఉమ్మడి కార్యచరణకు కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈ రెండు కమిటీలోనూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి అవకాశం లభించింది. ఇదే విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుందని టాక్.
ఇదే జిల్లాకు చెందిన కొందరు సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారంట. జిల్లాలోని టీడీపీ పార్టీలో ఆయన తప్ప.. ఇంకెవరు లేరా, అధిష్టానం దృష్టిలో తామంతా పనికిరాని వాళ్లమా? అని తెగ మదనపడిపోతున్నారంట ఆ టీడీపీ నేతలు. పసుపు పార్టీ ఆవిర్భావం నుంచి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయ చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ వంటి సీనియర్ నేతలు యాక్టీవ్ గా ఉన్నారు. కానీ వారెవరికి ఈ రెండు కమిటీల్లో అవకాశం లభించిందలేదు. అయితే ఆ కమిటీల్లో ఆయన తప్పా.. తాము పనికారామా? అని చర్చించుకుంటున్నారంట. బుచ్చయ్య చౌదరి, రాజప్పలు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
అయితే యనమల రామకృష్ణుడు 2004 తరువాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకపోగా, అతడి తమ్ముడు యనమల కృష్ణుడిని తుని నుంచి పోటీ చేయించిన వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. ఇలా గెలిచే తమని కాదని రెండు దశాబ్ధాల నుంచి గెలుపు ఊసే లేని వ్యక్తి అంత ప్రాధాన్యం ఇవ్వడమేంటి, ఒక కమిటిలో కాకుంటే మరొక దానిలో అవకాశం ఇవ్వొచ్చుకదా అని ఆ నేతలు అసంతృప్తిగా ఉన్నారంట. జనం నాడీ తెలియకుండా, ఆయన ఇచ్చే సలహాలు పార్టీకి ఏమాత్రం ఉపయోగపడతాయనే తూర్పు గోదావరిలోని కొందరు టీడీపీ నేతలు గుస్సగుస్సలాడుకుంటున్నారంట. గెలుపు ఎరుగని నేతను అన్నిటికి ఆయన ముందు కూర్చోబెట్టడం అవసరమానే చర్చకూడా పార్టీలో నడుస్తుందంట.
యువతరం రావాలి, కొత్త రక్తం పార్టీలోకి ఎక్కించాలని టీడీపీ అధిష్టానం చెబుతుంది. అయితే అలాంటి యువతకు అయినా కమిటీల్లో అవకాశం ఇవ్వొచ్చు కాదా అనే ప్రశ్నలు కూడ వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్లుగా తునిలో టీడీపీ జెండా ఎగరలేదు. యనమల ముందు ఇంట గెలిచి..తరువాత రచ్చ గెలవొచ్చుగా అనే వాళ్లు కూడా ఉన్నారు. ఇలా యనమల రామకృష్ణ, టీడీపీ అధినాయకత్వంపై ఆ జిల్లా సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి.. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేతల అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.