Arjun Suravaram
YS Jagan, Pawan: రాజకీయాల్లో నాయకులు చేసే చిన్న చిన్న తప్పిదాలు ప్రత్యర్థిపార్టీకి చాలా అనుకూలంగా మారుతాయి. ఎంతలా అంటే.. ప్రత్యర్థికి పార్టీకి అధికారం అందే అంతలా భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై ఇలాంటి టాకే వినిపిస్తోంది.
YS Jagan, Pawan: రాజకీయాల్లో నాయకులు చేసే చిన్న చిన్న తప్పిదాలు ప్రత్యర్థిపార్టీకి చాలా అనుకూలంగా మారుతాయి. ఎంతలా అంటే.. ప్రత్యర్థికి పార్టీకి అధికారం అందే అంతలా భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై ఇలాంటి టాకే వినిపిస్తోంది.
Arjun Suravaram
రాజకీయాలు చేయడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో చాకచక్యంగా, వ్యూహాలు రచిస్తూ ఉంటేనే ఈ రంగంలో రాణించగలరు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీకి ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ఎంతో జాగ్రత్తగా ప్రసంగం చేస్తుండాలి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. అయితే కొందరు నాయకులు చేసే అతి ప్రసంగాలు, ప్రత్యర్థి పార్టీ నేతల నెత్తిన పాలు పోస్తుంటాయి. గతంలో రెడ్ బుక్ పేరుతో లోకేష్ జగన్ కి సాయం చేయగా, తాజాగా జెండా సభలో తన ప్రసంగంతో జగన్ గెలుపుకి పవన్ సాయం చేశారనే టాక్ వినిపిస్తోంది.
రాజకీయాల్లో పార్టీలకు వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎంత ముఖ్యమో, సభలను ఏర్పాటు చేయడం, అక్కడ ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగించడం కూడా అంతే ముఖ్యం. అయితే జనాలని ఆకట్టుకునే క్రమంలో లాజిక్ మిస్సై.. మాట్లాడితే మాత్రం అది ప్రత్యర్థి పార్టీలకు, నేతలకు అనుకూలంగా మారుతుంది. తాము నిర్వహించుకునే సభలో ప్రత్యర్థుల గురించి తక్కువ మాట్లాడి.. తాను ఏం చేస్తాను అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అలా కాకుండా ప్రత్యర్థిపై దూషణ చేయడమే పనిగా పెట్టుకుంటే.. ప్రతికూలత ఏర్పడుతుంది. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విషయంలో అదే జరిగిందని టాక్ వినిపిస్తోంది.
రెండు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో జరిగిన టీడీపీ, జనసేన కూటమి జెండా సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక పవన్ ప్రసంగంపై సొంత పార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేశారు. వామనుడి, దేవదత్తుడిని ప్రత్యర్థి పార్టీని తొక్కేస్తాను అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. అంతేకాక తాడేపల్లి కోటను బద్దలు కొడతా అంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగ్స్ చెప్పారు. ఇలా జెండా సభలో పవన్ చేసిన ప్రసంగం మొత్తం సీఎం జగన్ తిట్టడం కోసమే అన్నట్లు సాగింది. అయితే ఎక్కడా కూడా తన పవర్ షేరింగ్, సీట్ల విషయాన్ని ప్రస్తావించలేదు. తనను ఎవరూ ప్రశ్నించవద్దు అంటూ ఆదేశాలు సైతం జారీ చేశారు. అయితే పవన్ వ్యాఖ్యలతో జనసేన కార్యకర్తలే కాక ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను ప్రజలకు ఏం చేస్తాను, కార్యకర్తలను ఎలా ఆదుకుంటాను అనే విషయాలను ఎక్కడా ప్రస్తావించలేదు.
ఇక పవన్ చేసిన ప్రసంగంతో టీడీపీకి ఓటేసే ప్రసక్తే లేదని ఆలోచనలోకి జనసేన కార్యకర్తలు, జనం వెళ్లినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఎంతో ధైర్యంగా తన ద్వారా మంచి జరిగి ఉంటేనే ఓటు వెయ్యండి అని చెప్పాడు. ఆ స్థాయిలో పవన్, చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని జనం భావిస్తున్నారు. పదేళ్ల నుంచి పార్టీని నడుపుతున్నానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ తాను చేసే ప్రసంగం జగన్ కి ప్లస్ అవుతుందనే లాజిక్ ఎలా మిస్సయ్యాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో జనసేన, టీడీపీ కూటమి కంటే సీఎం జగన్ నే మేలు అనే భావనలోకి ప్రజలు వచ్చారనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా పవన్ ఇచ్చిన స్పీచ్ జగన్ నెత్తిన పాలు పోసినట్లు అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.