P Krishna
Srisailam: ఇప్పటి వరకు పురావస్తు తవ్వాకాల్లో ఎన్నో అద్భుతాలు బయటపడ్డాయి. తవ్వకాల్లో బయటపడే శిలాశాసనాల వల్ల నాటి పరిస్థితులు, ప్రజల జీవన విధానం ఏలా ఉండేదన్న విషయం తెలుస్తుంది.
Srisailam: ఇప్పటి వరకు పురావస్తు తవ్వాకాల్లో ఎన్నో అద్భుతాలు బయటపడ్డాయి. తవ్వకాల్లో బయటపడే శిలాశాసనాల వల్ల నాటి పరిస్థితులు, ప్రజల జీవన విధానం ఏలా ఉండేదన్న విషయం తెలుస్తుంది.
P Krishna
పురావస్తు శాస్త్రం అంటే పూర్వీకుల జీవన విధానం గురించి శాస్త్రీయంగా విశ్లేషించే ఒక అధ్యాయన శాస్త్రం. తవ్వకాల్లో బయటపడ్డ కళాఖండాలు, నిర్మాణాలు, శాసనలు, వస్తువులు ఇలా ఎన్నో విషయాలపై పరిశోధన చేస్తారు. జాతులు, భాషలపై చరిత్రకి నమ్మకమైన భౌతిక అక్షరాల్లో శాసనాలు ఎంతో ముఖ్యభూకి పోషిస్తాయి. నాటి శాసనాల్లో లిఖించిన విధానాన్ని బట్టి అప్పటి పరిస్థితులు, జీవన శైలి ఎలా ఉన్నదన్న విషయం అవగతం అవుతుంది. పురావస్తు తవ్వకాల్లో అప్పుడప్పుడు అద్భుతాలు వెలుగు చూస్తుంటాయి. తాజాగా శ్రీశైలం రోడ్డు విస్తరణ సందర్భంగా జరిపిన తవ్వకాల్లో అద్భుతం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..
శ్రీశైలం లో అద్భుత ఘటన వెలుగు చూసింది. జ్యోతిర్లింగం శక్తి పీఠం కొలువైన ఉన్న శ్రీశైలం మహా క్షేత్రంలో 14వ శతాబ్దం నాటి శిలాశాసనం, పురాతన శివలింగం బయటపడ్డాయి. ఇక్కడ రోడ్డు విస్తరణ సందర్భంగా జరిపిన తవ్వకాల్లో పురాతన కాలం నాటి శివలింగ, శిలా శాసనం బయటపడింది. శివ లింగం చూసి భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు.. శంభో శంకర, హర హర మహదేవా, నమః శివాయ అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. శివ భక్తులు అమితానందంతో ఆ ప్రాంతానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం పరిధిలో యాంఫీ థియేటర్ సమీపంలో నూతనంగా సీసీ రోడ్డు, సపోర్ట్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఈ క్రమంలోనే జేసీబీ సహాయంతో త్రవ్వకాలు చేపట్టారు. ఆ సమయంలో ఓ శివలింగం, నందీశ్వరుడి విగ్రహం బయటపడింది. శివలింగం పక్కనే తెలియని లిపితో రాసి ఉన్న శాసనం గుర్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని ఫోటోలు తీసి మైసూర్ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కు దేవస్థానం అధికారులు పంపించారు. బయటపడిన పురాతన శివలింగం వద్ద ఉన్న శాసన లిపి 14, 15వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా గుర్తించారు. తవ్వకాల్లో బయడపడ్డ శివలింగం దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. గతంలో కూడా శ్రీ శైలంలో పురావస్తు తవ్వకాల్లో పలు విగ్రహాలు బయడపడిన విషయం తెలిసిందే.