విషాదం: భారీ వర్షాల దెబ్బకి కాలువలో కొట్టుకుపోయిన కారు!

Guntur: ఏపీ వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇదిలా ఉంటే గుంటూరులో కూడా వానలు దంచికొడుతున్నాయి.

Guntur: ఏపీ వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇదిలా ఉంటే గుంటూరులో కూడా వానలు దంచికొడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కుండపోత వానలు ముంచెత్తుతున్నాయి. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు వరుణుడు ఏ జిల్లాను వదిలిపెట్టడం లేదు. దీంతో భారీగా వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరుతుంది.  జన జీవనం అస్థవ్యస్థమైంది. మరో వైపు రెయిన్స్ కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో అటు విజయవాడ మాత్రమే కాదు ఇటు గుంటూరులో కూడా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. పల్నాడు, గుంటూరు జిల్లాలను కుంభవృష్టిగా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లా పెద కాకాని మండలంలో విషాదం నెలకొంది. వరద ఉధృతికి వాగులో కారు కొట్టుకుపోయింది. ఉప్పలపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

ఉప్పలపాడు-గోళ్లమూడి మధ్య వరద ఉధృతికి కాల్వలో కొట్టుకు పోయింది కారు. నంబూరు పాఠశాలలో పనిచేస్తున్న రాఘవేంద్ర అనే వ్యక్తి.. స్కూల్స్‌కు సెలవు కావడంతో పిల్లలను తీసుకుని కారులో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండగా.. పట్టించుకోకుండా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. ఈ వరద ఉధృతికి కారు కాల్వలో కొట్టుకుపోయిందని అంటున్నారు. మృతులను రాఘవేంద్రతో పసుపులేటి సంతీప్, కోడూరి మాన్విత్‌గా గుర్తించారు. వీరి మరణ వార్త తెలియగానే.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.  ఈ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

గుంటూరు జాతీయ రహదారిపై కూడా వరద నీరు ప్రవహిస్తోంది. కాజా టోల్ ఫ్లాజా వద్ద వరద నీటిలో చిక్కుకుపోయాయి వాహనాలు. వాహనాలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ప్రయాణీకులు. కాజా టోల్ ఫ్లాజా వద్ద ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని ప్రజలను హితవు కోరుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మొదలుకుని పల్నాడు ప్రాంతాలను వానలు ముంచెత్తుతున్నాయి. చెరువులు నిండుకుంటాయి. అలాగే వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగింది. ఇక ఏపీ వ్యాప్తంగా కూడా కుండపోతగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Show comments