Krishna Kowshik
ఇప్పుడిప్పుడే వరద ముంపు నుండి బయటపడుతున్న బెజవాడను మరోసారి వానలు భయపెడుతున్నాయి. రానున్న రోజుల్లో ఆ జిల్లాలో భారీ వానలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇప్పుడిప్పుడే వరద ముంపు నుండి బయటపడుతున్న బెజవాడను మరోసారి వానలు భయపెడుతున్నాయి. రానున్న రోజుల్లో ఆ జిల్లాలో భారీ వానలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Krishna Kowshik
ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యింది. ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రాయలసీమ వరకు చిగురుటాకులా వణికింది. వరుణుడు తన ప్రతాపాన్ని చూపించడంతో గ్యాప్ లేకుండా వానలు పడ్డాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీరు ప్రవహించి ప్రాజెక్టులనే కాదు నివాస ప్రాంతాలను ముంచేసింది. ముఖ్యంగా విజయవాడ నగరంలో వరదలు విలయతాండవం చేశాయి. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో ఇంటిని వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. తిండి తిప్పలు లేక.. సరైన సాయం అందక నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే ముంపు నుండి బయటపడుతుంది బెజవాడ సిటీ. కానీ అంతలోనే మరోసారి ఏపీని అల్పపీడనం వణికిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
రుతుపవనాలు చురుగ్గా ఉండటం వల్ల బంగాళా ఖాతంలో మరో అల్పపీడన ఏర్పడనుందని.. రాబోయే నాలుగు రోజుల్లో ఉత్తరాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడవచచునని వాతావరణ శాఖ తెలిపింది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అనకాపల్లి, విశాఖ , కాకినాడ, కోనసీమ, గోదావరి, కృష్ణా జిల్లాల్లో రెండు రోజుల పాటు మోస్తారు వర్షాలు పడుతాయని తెలిపింది. ఇప్పుడిప్పుడే వరద నుండి బయటపడుతున్న విజయవాడ పరిసర ప్రాంతాలకు ఈ రెయిన్ అలర్ట్ మరింత భయానికి గురి చేస్తుంది. ముఖ్యంగా నాలుగు రోజులుగా వరద నీటిలో మునిగిపోయి ఉన్న నగర వాసులు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో వాతావరణ హెచ్చరిక భయపెడుతోంది.