NTR District YSRCP Candidates List: NTR జిల్లా YSRCP అభ్యర్థుల లిస్ట్‌ ఇదే

NTR Krishna District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ కూడా తమ అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేసింది. మరి ఆ లిస్ట్‌లో ఎన్టీఆర్‌ జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎవర్ని బరిలోకి దింపిందో చూద్దాం..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించిన తర్వాత.. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ నేతలు ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామ సురేష్‌ అభ్యర్థుల పేర్లు చదివి వినిపించారు. అయితే.. వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన కొద్ది సేపటికే భారత ఎన్నికల కమీషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మే 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌ జరగనుంది. ఈ క్రమంలోనే ఏపీలో ఎంతో కీలకమైన జిల్లా ఎన్టీఆర్‌ జిల్లాలోని నియోజకవర్గాల్లో వైసీపీ ఎవర్ని అభ్యర్థులుగా నిలిపిందో ఇప్పుడు చూద్దాం..

ఎన్టీఆర్‌ జిల్లా

  • తిరువూరు – నల్లగట్ల స్వామి దాస్‌ – ఎస్సీ(మాదిగ)
  • విజయవాడ(పశ్చిమ) – షేక్‌ ఆసిఫ్‌ – మైనార్టీ(ముస్లిం)
  • విజయవాడ(సెంట్రల్‌) – వెల్లంపల్లి శ్రీనివాసరావు – ఓసీ(ఆర్యవైశ్య)
  • విజయవాడ(తూర్పు) – దేవినేని అవినాష్‌ – ఓసీ(కమ్మ)
  • మైలవరం – సర్నాల తిరుపతిరావు – బీసీ(యాదవ)
  • నందిగామ – మొండితోక జగన్‌ మోహన్‌ రావు – ఎస్సీ(మాదిగ)
  • జగ్గయ్యపేట – సామినేని ఉదయ భాను – ఓసీ(కాపు)

Show comments