Arjun Suravaram
Chirala MLA: నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల కారణంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Chirala MLA: నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల కారణంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Arjun Suravaram
ఇటీవల కాలంలో ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్, రసాయనాల పేలుడు, ఇంధనాలు ట్యాంకర్లు పేలిపోవడం వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మరెందరో తీవ్రగాయాలతో నరకయాతన అనుభవిస్తుంటారు. ఇంకా ఈ ప్రమాదాల కారణంగా భారీ ఆస్తి నష్టం కూడా సంభవిస్తుంది. తాజాగా ఏపీలోని ఓ ఎమ్మెల్యే కంపెనీలు భారీ అగ్నిప్రమాదం జరిగింది. మరి.. ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రూ.70 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఎం.గంగవరంలో ఎమ్మెల్యే కరణం బలరాంకు చెందిన మెగా పుడ్ పార్క్ ఉంది. అక్కడ కోడి గుడ్లు పాశ్చరైజేషన్ చేసి ఎగుమతి చేస్తారు. ఇక్కడ నుంచి భారీగా ఎగుమతులు జరగుతుంటాయి. ఈ క్రమంలోనే మంటలు ఒక్కసారిగా షెడ్ కు అంటుకుని వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుంది. మూడు ఫైరింజన్లు అక్కడి చేరుకుని మంటలను అదుపు చేశాయి.
ఇక ఈ భారీ అగ్ని ప్రమాద తీవ్రతకు షెడ్డు మొత్తం కుప్పకూలిపోయింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఏమిటనేది తెలియ రాలేదు. గతంలోనూ విశాఖ షిప్ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో పదుల సంఖ్యలో బోట్లు బూడిదగా మారాయి. ఈ ఘటన రాష్ట్రంలోని సంచలనంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కీలక ఆధారాలను సైతం సేకరించారు.ఇక ఆ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. తాజాగా చీరాల ఎమ్మెల్యే కంపెనీలు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.