రేపల్లె సమీపంలో తెగిన కృష్ణానది కరకట్ట.. ప్రజలను ఖాళీ చేయిస్తున్న అధికారులు

Repalle: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వరదలతో కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తున్నది. ఈ క్రమంలో కరకట్టకు ప్రమాదం పొంచి ఉన్నది. ఈనేపథ్యంలో రేపల్లె పట్టణానికి వరద ముప్పు పొంచి ఉంది.

Repalle: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వరదలతో కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తున్నది. ఈ క్రమంలో కరకట్టకు ప్రమాదం పొంచి ఉన్నది. ఈనేపథ్యంలో రేపల్లె పట్టణానికి వరద ముప్పు పొంచి ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలతో రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. వాగులు, నదులు ఉగ్రరూపం దాల్చడంతో వరద పోటెత్తింది. భారీగా వస్తున్న వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విజయవాడ నగరం జలదిగ్భందంలో చిక్కుకుంది. కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కృష్ణానదికి భారీగా వరద పోటెత్తుతుండడంతో కరకట్టకు ప్రమాదం పొంచి ఉన్నది. కరకట్టకు గండిపడింది. అమరావతి నుండి సిఎం చంద్రబాబు ఇంటి వైపుగా ఉండే కృష్ణా కరకట్ట తెగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కృష్ణ, గుంటూరు జిల్లా వాసులు భయం గుప్పెట్లో ఉన్నారు. దీని ప్రభావంతో రాజధాని ప్రాంతంలో ముంపు పెరగనుంది.

ఈనేపథ్యంలో రేపల్లె పట్టణానికి వరద ముప్పు పొంచి ఉంది. రేపల్లె సమీపంలో కృష్ణానది కరకట్ట తెగింది. రేపల్లె మండలం రావి అనంతారం వద్ద కరకట్ట తెగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కరకట్ట వెంట నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కరకట్టకు పడిన గండిని పూడ్చేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు, స్థానికులు. ట్రాక్టర్లతో మట్టి ఇసుక బస్తాలు తెచ్చి కట్టలు మూసే ప్రయత్నాలు చేస్తున్నారు. భట్రిప్రోలు మండలం ఓలేరుపల్లి పాలెంకు వరద ముంపు పొంచి ఉంది. గొనిగపూడిలో పంటలు నీట మునిగాయి. కొల్లూరు, కోటిపల్లి మండలాల్లో కరకట్ట బలహీనంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బాపట్ల జిల్లా లంక గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Show comments