Keerthi
ఇప్పుడిప్పుడే భారీ వర్షాల నుంచి తేరుకుంటున్న ఏపీ వాసులకు మరో పిడుగులాంటి వార్త నెత్తిన పడింది. తాజాగా బంగాళఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలో వర్షాలు కురవనున్నయని వాతవరణ శాఖ తెలిపింది.
ఇప్పుడిప్పుడే భారీ వర్షాల నుంచి తేరుకుంటున్న ఏపీ వాసులకు మరో పిడుగులాంటి వార్త నెత్తిన పడింది. తాజాగా బంగాళఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలో వర్షాలు కురవనున్నయని వాతవరణ శాఖ తెలిపింది.
Keerthi
గత వారం రోజుల క్రితం ఏపీలోని భారీగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో.. దీని ప్రభావం ఉత్తరాంధ్ర వైపు ఎక్కువగా చూపింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలోని భారీ వర్షాలు, బలమైన గాలులకు భారీగా చెట్లు, కొండచరియలు రోడ్లపై విరిగి పడటంతోరహాదారికి అంతరాయం కలిగించాయి. అంతేకాకుండా.. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ భారీ వర్షాలకు నదులు, వాగులు, చెరువుల్లో నీటి ఉద్ధృతి బాగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే ఆ వర్షాల తీవ్రత నుంచి ఊపిరి పీల్చుకున్న ఏపీ వాసులకు మరో పిడుగులాంటి వార్త నెత్తిన పడింది. తాజాగా బంగాళఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలో వర్షాలు కురవనున్నయని వాతవరణ శాఖ తెలిపింది. ఆ వివరాలేంటో చూద్దాం.
ఏపీలో మరోసారి వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని.. దీని ప్రభావం ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాలకు ఎక్కువగా ఉంటుదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. అలాగే ఈ వాయుగుండం ప్రభావం ఏపీపై కూడా స్వల్పంగా ఉంటుందని, దీంతో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే ఈ నెల 20 నుంచి అక్టోబరు మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వానలు కురవనున్నాయని వాతవరణ శాఖ పేర్కొంది. ఇకపోతే ఇప్పుడిప్పుడే భారీ వర్షాల నుంచి తేరుకుంటున్న సమయంలో.. మళ్లీ వర్షాలు కురువనున్నయని వాతవారణ శాఖ ప్రకటించడంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా.. గురువారం కూడా పలు జిల్లాల్లో తేలికపాటి వానలు కురిశాయని, మరి కొన్ని జిల్లాల్లో ఎండలు మండిపడ్డాయని ఐఎండీఏ వెల్లడించింది. మరీ, ఏపీలో మరోసారి వర్షాలు కురవనున్నాయని వాతవరణ శాఖ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.