IMD అలర్ట్.. ఏపీ, తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు!

Telangana Weather Report: ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలోని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి వానలు కురుస్తాయని తెలిపింది.

Telangana Weather Report: ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలోని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి వానలు కురుస్తాయని తెలిపింది.

ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావం తమిళనాడు సహా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నిన్నటి వరకు తెలంగాణలో పొడి వాతావరణం ఉన్న విషయం తెలిసిందే. అల్ప పీడన ప్రభావంతో బుధవారం (నవంబర్ 13) రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబర్ 16 వ తేదీ వరకు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.పగటిపూట వాతావరణం పొడిగా ఉంటుందని, సాయంత్రానికి చల్లబడి పలు చోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.  హైదరాబాద్ లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. వివరాల్లోకి వెళితే..

గత కొన్నిరోజులుగా తెలంగాణలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో 14 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఖమ్మంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్ లో 33.4 డిగ్రీలు నమోదైంది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్ష సూచనతో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. చలికాలం కావడం వల్ల అస్తమా, దగ్గు, జలుబు ఉన్న వారు.. వృద్దులు, చిన్న పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే.. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

నేడు బాపట్ల, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే.. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, వైఎస్ఆర్, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, శ్రీ సత్యసాయి, కడప, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఏపీలో వర్షాలు అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాల యాంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా నెల్లూరు, కావలి పట్టణాల్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరించింది. పండిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించింది.

Show comments