Vinay Kola
Heavy Rains: సైక్లోన్ ప్రభావంతో వర్షాలు అలజడి సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జనాలు సతమతమవుతున్నారు. వర్షం ధాటికి అల్లకల్లోలం అవుతున్నాయి.
Heavy Rains: సైక్లోన్ ప్రభావంతో వర్షాలు అలజడి సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జనాలు సతమతమవుతున్నారు. వర్షం ధాటికి అల్లకల్లోలం అవుతున్నాయి.
Vinay Kola
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎక్కడ చూసినా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పైగా వాయు గుండం కావడంతో అతి భారీ వర్షాలు ప్రజలకు చాలా ఇబ్బందిగా మారాయి. సైక్లోన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అలజడి సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా జనాలు ఎంతగానో సతమతమవుతున్నారు. ముఖ్యంగా బంగాళా ఖాతానికి దగ్గరగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వర్షం ధాటికి అల్లకల్లోలం అవుతున్నాయి. ఇలా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా చాలా చోట్ల ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. పలు చోట్ల తీవ్రంగా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. పంట పొలాలు వర్షం ధాటికి చెల్లా చెదురు అయిపోతున్నాయి. చాలా మంది కూడా వర్షం సునామీలో కొట్టుకుపోతూ తమ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు.
ప్రజలు కచ్చితంగా చాల జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎంత పని ఉన్నా కూడా అస్సలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం దెబ్బకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా ఆగని వర్షపు నీటితో జలమయం అయిపోయాయి. అలాగే పలు పల్లపు ప్రాంతాల్లోని నివాసాల్లోకి వరద నీరు సునామీలా వచ్చి చేరింది. ఇలా ఈ వర్షాల దెబ్బకు ఆంధ్ర ప్రదేశ్లో 9 మంది మరణించారని సమాచారం తెలుస్తుంది. ఇంకా అలాగే తెలంగాణాలో కూడా 9 మంది మరణించారని సమాచారం తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా ఇలా ఒక రోజులో 18 మంది చనిపోయారంటే మామూలు విషయం కాదు. గతంలో ఒకే రోజులో ఇంత మంది చనిపోలేదు. కానీ ఈ ఏడాది ఒకే రోజులో 18 మంది చనిపోవడం బాధాకరం. రాబోయే 24 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం పుష్కలంగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.