Uppula Naresh
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, దీని ఎఫెక్ట్ మరికొన్ని రోజుల పాటు ఉండడంతో అధికారులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే ఛాన్స్ ఉంది.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, దీని ఎఫెక్ట్ మరికొన్ని రోజుల పాటు ఉండడంతో అధికారులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే ఛాన్స్ ఉంది.
Uppula Naresh
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ఎఫెక్ట్ తో సముద్ర తీర ప్రాంతాలు చిగురు టాకులా వణుకుతున్నాయి. మరీ ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు ఈ తుఫాన్ ప్రభావం ఏపీలోనే కాకుండా చెన్నైలో కూడా చూపుతుంది. సముద్ర తీరంలోని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దీంతో ప్రభుత్వాలు అధికారులకు ఆదేశాలను జారీ చేశాయి. ఇక అప్రమత్తమై ఆఫీసర్స్ సహాయక చర్యలు చేపట్టారు. దీంతో పాటు హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఉంచారు. ఇంతే కాకుండా ఇప్పటికే స్కూళ్ల్, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. ఈ తుఫాను ప్రభావం చెన్నైలో ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండడంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న చెట్ల కొమ్మలు, విద్యుత్ స్థంభాలు నెలకొరిగాయి. సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇకపోతే, ఈ తుఫాను కారణంగా హైదరాబాద్ లో కూడా సోమవారం అర్థరాత్రి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం కూడా వర్షం కూడా కురవడంతో స్కూల్స్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. వీరితో పాటు ఉద్యోగులు వెళ్లేందుకు కూడా వర్షం అడ్డంకిగా మారింది. ఇదిలా ఉంటే.. మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ మరికొన్ని రోజుల పాటు ఉండనుండడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఏపీలోని 11 జిల్లాలకు అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం ముందస్తుగా మరో రెండు రోజుల పాటు స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది. అయితే, ఈ అంశంపై ఇంకా అధికారిక ప్రకటన వెలు వడాల్సి ఉంది.