పొలంలో రైతుకు దొరికిన వజ్రం.. ధర ఎంతో తెలుసా?

Kurnool: రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వగానే.. ఏపిలో తొలకరి చినుకులు నేలని ముద్దాడిన తర్వాత కొన్ని ప్రాంతాల్లోని పొలాల్లో వజ్రాల కోసం వేట కొనసాగుతుంది. రైతులు, కూలీలకు ఎప్పుడో ఒకసారి వజ్రం రూపంలో అదృష్టం వరిస్తుంది.

Kurnool: రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వగానే.. ఏపిలో తొలకరి చినుకులు నేలని ముద్దాడిన తర్వాత కొన్ని ప్రాంతాల్లోని పొలాల్లో వజ్రాల కోసం వేట కొనసాగుతుంది. రైతులు, కూలీలకు ఎప్పుడో ఒకసారి వజ్రం రూపంలో అదృష్టం వరిస్తుంది.

ఏపీలో వర్షాలు కురుస్తున్నాయంటే చాలు.. కొన్ని ప్రాంతాల ప్రజలు సంబరాలు చేసుకుంటారు. తొలకరి జల్లు పలకరించగానే.. పొలాలు, కొండ ప్రాంతాల్లో వజ్రాల వేట మొదలు పెడతారు. ఒక్క వజ్రం దొరికితే చాలు  జాతకాలే మారిపోతుంటాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ ఆర్థిక కష్టాలు గట్టెక్కుతాయని వజ్రాల ఏరివేతకు తండోపతండాలుగా బయలుదేరుతారు. మహిళలు, వ్యవసాయకూలీలు చివరికి చిన్న పిల్లలు కూడా ఈ పనిలో నిమగ్నమైతారు. కొన్నిసార్లు వారు పడ్డ కష్టానికి ఫలితం దక్కి వజ్రాలు దొరుకుతున్న విషయం తెలిసిందే.  తాజాగా కర్నూల్ జిల్లాలో ఓ రైతుకు వజ్రం రూపంలో అదృష్టం వరించింది. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలో ఓ రైతును వజ్రం రూపంలో అదృష్టం వరించింది. చాలా రోజుల తర్వాత పొలంలో వజ్రం దొరకడం విశేషం. ఇప్పటికే జిల్లాల్లో వర్షం పడిన తర్వాత వజ్రాల వేట మొదలైంది. ఈ క్రమంలోనే కొంతమందికి వజ్రాలు దొరుకుతున్నాయి. తుగ్గలి మండలం జొన్నగిరిలో పొలం పనులకు వెళ్లిన రైతుకు ఓ వజ్రం దొరికింది. దీన్ని ఓ వ్యాపారి రూ.12 లక్షలతో పాటు 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. రైతుకు పొలంలో వజ్రం దొరికిందని తెలియగానే చుట్టుపక్కల పొలాల్లో వజ్రాల కోసం గాలింపు ముమ్మరం చేశారు జనాలు. ఇటీవల కొంతమంది వ్యాపారులు ఏజెంట్లను నియమించుకొని మరీ పొలాల్లో దొరికిన వజ్రాలను కొనుగోలు చేస్తున్నారు. రైతులకు, కూలీలకు దొరికిన వజ్రాలను కొనుగోలు చేసి మంచి ధరలకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు వ్యాపారస్తులు.

ఏపీలో వర్షాకాలంలో ఎక్కువగా కర్నూల్, అనంతపురం జిల్లాల్లో వజ్రాలు లభ్యమవుతున్నాయి. కర్నూల్ జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లో జొన్నగిరి, పెరవలి, పగిడిరాయి, కొత్తపల్లి, మద్దికెర, అగ్రహారం, యడవలి, హంప గ్రామాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి. ఇక అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలంలోని రాగులపాడు, పొట్టిపాడు, గుళిపాళ్యం, గంజికుంట, కమలపాడు, ఎన్ఎంపి తండాతో పాటు మరికొన్ని గ్రామాల్లో వజ్రాలు లభిస్తున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం తొలకరి జల్లు పడగానే వజ్రాల వేటకు బయలుదేరుతారు. వజ్రం రంగు, జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్కగట్టి విలువ చెల్లిస్తుంటారు..కొంతమంది బంగారం ఇస్తుంటారు.

Show comments