వర్షాన్ని, గొడవలను లెక్కచేయకుండా పోటెత్తిన ఓటర్లు.. APలో రికార్డు స్థాయిలో పోలింగ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చైతన్యం కనబరిచారు. వర్షాన్ని, గొడవలను లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. ఈ సారి ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చైతన్యం కనబరిచారు. వర్షాన్ని, గొడవలను లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. ఈ సారి ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లలో చైతన్యం వెల్లువిరిసింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒకరోజు ముందుగానే సొంతూళ్లకు చేరుకున్నారు. నేడు జరిగిన పోలింగ్ లో ఓటర్లు పోటెత్తారు. ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు ఒకే రోజు పోలింగ్ జరిగింది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. వర్షం పడుతున్నా కూడా తమ బాధ్యతను మరవకుండా ఓటు వేసేందుకు ఓటర్లు కదిలి వచ్చారు. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి అత్యధిక శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.

నేడు ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరుగంటలకు ముగిసింది. సమయం ముగిసిన తర్వాత కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలలో బారులు తీరారు. పలు నియోజక వర్గాల్లో అల్లర్లు, ఓ వైపు వర్షం ఇన్ని జరుగుతున్నా ఓటర్లు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడం మరవలేదు. ఈసారి పోలింగ్ శాతం గతంలో లేని విధంగా 80 శాతం రికార్డ్ స్థాయిలో నమోదయ్యేలా తెలుస్తోంది. ఏపీలో 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 75.9 శాతం, 2014లో 78.4 శాతం, 2019 లో 79.6 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ప్రస్తుతం జరుగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటలకే 67.99 శాతం పోలింగ్ నమోదైంది.

జిల్లాలవారీగా పోలింగ్ శాతం:

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 74.06 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 55.17 శాతం పోలింగ్ నమోదైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా 73.55 శాతం, కృష్ణా జిల్లా 73.53 శాతం, బాపట్ల జిల్లాలో 72.14 శాతం, వైఎస్ఆర్ కడప జిల్లాలో 72.85 శాతం, నంద్యాలలో 71.43 శాతం, ప్రకాశం 71 శాతం, నెల్లూరు జిల్లాలో 69.95 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లాలో 68.04 శాతం, పల్నాడు జిల్లాలో 69.10 శాతం, అన్నమయ్య జిల్లాలో 67.63 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 67.44 శాతం, విజయనగరం జిల్లాలో 68.16 శాతం, అనకాపల్లి జిల్లాలో 65.97 శాతం, తిరుపతిల 65.88 శాతం, గుంటూరు జిల్లాలో 65.58 శాతం, కాకినాడ జిల్లాలో 65.01 శాతం, కర్నూలు జిల్లాలో 64.55 శాతం, మన్యం జిల్లాలో 61.18 శాతం, విశాఖ జిల్లాలో 57.42 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.మొత్తంగా సాయంత్రం ఐదు గంటల వరకూ 68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు.

Show comments