CM Jagan: సీఎం జగన్‌ మంచి మనసు.. బస్సు యాత్ర చేస్తూ.. అంబులెన్స్‌కి దారి

Memantha Siddham: కష్టం అని తెలిస్తే చాలు వెంటనే స్పందిస్తారు సీఎం జగన్‌. ఈ క్రమంలో తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు జగన్‌. ఆ వివరాలు..

Memantha Siddham: కష్టం అని తెలిస్తే చాలు వెంటనే స్పందిస్తారు సీఎం జగన్‌. ఈ క్రమంలో తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు జగన్‌. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయ్యింది. ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. మూడు రోజుల క్రితం అనగా బుధవారం నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించి.. జనాల్లోకి వెళ్తున్నారు సీఎం జగన్‌. తోబుట్టువులా, కొడుకులా తమను ఆదుకుంటున్న నేత జగన్‌ను చూసేందుకు భారీ ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. ఆరంభం నుంచే పెద్ద ఎత్తున​ జనాలు మేమంతా సిద్ధం సభలకు తరలి వస్తుండగా.. ఈ జన ప్రవహాన్ని చూసి విపక్షాలు బెదిరిపోతున్నాయి.

మేమంతా సిద్ధం సభకు తరలి వస్తోన్న జన ప్రవాహాన్ని చూస్తే.. వైసీపీ క్లీన్‌ స్వీప్‌ మీద ఉన్న అరకొర అనుమానాలు సైతం పటాపంచలు అవుతున్నాయి. నిత్యం ప్రజా సంక్షేమం గురించే ఆలోచించే జగన్‌.. ఎన్నికల ప్రచార వేళ సైతం తన మంచి మనసు చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సీఎం జగన్‌.. మూడో రోజు కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగించారు. దారి పొడవునా తన కోసం ఎదురు చూస్తోన్న అవ్వా, అక్కాచెల్లెమ్మలను చూసి.. బస్సు దిగి వచ్చి వారిని ఆప్యాయంగా పలకరించారు. వాళ్లలో కొందరు సీఎం జగన్‌ సాయం కోరగా అందుకు చర్యలు తీసుకోవాలని పక్కనే ఉన్న అధికారుల్ని ఆదేశించారు.

ఇక కోడుమూరులో జగన్‌ బస్సు యాత్ర చేస్తుండగా.. అదే దారిలో అంబులెన్స్‌ వచ్చింది. ఇది గమనించిన సీఎం జగన్‌.. అంబులెన్స్‌కి దారి ఇచ్చారు. దాంతో క్షణాల్లో రోడ్డు క్లియర్‌ చేయడంతో.. అంబులెన్స్‌ ముందుకు సాగిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక జననేతకు జనాలు బ్రహ్మరథం పట్టారు. తమ ప్రాంతానికి వచ్చిన సీఎం జగన్‌కు భారీ గజమాలతో స్వాగతం పలకడమే కాక.. అనేక కానుకలు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు జనాలు. దారి పొడవునా జై జగన్‌ నినాదాలు చేస్తూ.. జననేతపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Show comments