Venkateswarlu
Venkateswarlu
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 దిగ్విజయం అయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ ఎంతో క్లిష్టతరమైన ల్యాండింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసి, చంద్రుడిపై అడుగుపెట్టింది. ప్రస్తుతం చంద్రుడిపై పరిశోధనలు చేస్తోంది. మరికొన్ని రోజుల్లో విక్రమ్ ల్యాండర్ వెనక్కు తిరిగి రానుంది. ఇలాంటి ఈ సమయంలో పెను విషాదం చోటుచేసుకుంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాంచ్ చేస్తున్న సందర్భంలో ల్యాండింగ్ కౌంట్ డౌన్‌కు సంబంధించి వాయిస్ ఓవర్ ఇచ్చిన సైంటిస్ట్ కన్నుమూశారు.
ఆగస్టు 23న వాయిస్ ఓవర్ ఇచ్చిన వలర్మతి అనే సైంటిస్ట్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆదివారం మరణించారు. ఇక, వలర్‌మతి మరణంపై ఇస్రో మాజీ డైరెక్టర్ పీవీ వెంకట క్రిష్ణన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతాలో నిన్న ఓ పోస్టు పెట్టారు. శ్రీహరి కోటలోని ఇస్రో మిషన్స్‌కు సంబంధించిన కౌంట్ డౌన్స్‌కు వలర్‌మతి మేడమ్ వాయిస్ ఇకపై ఉండదు. చంద్రయాన్ 3 ఆమె చివరి కౌంట్ డౌన్ అనౌన్స్‌మెంట్. ఊహించని విధంగా ఆమె చనిపోయారు. ఎంతో బాధగా ఉంది. ప్రణామాలు!’’ అని పేర్కొన్నారు.
కాగా, ఇస్రో సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్ -1 పేరిట ఓ మిషన్‌ను ఆకాశంలోకి పంపింది. సెప్టెంబర్ 2వ తేదీన ఈ మిషిన్ విజయవంతంగా ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఆదిత్య ఎల్-1 ద్వారా ఇస్రో కరోనాతో పాటు సూర్యుడి కాంతి కిరణాల ప్రభావంపై పరిశోధనలు చేయనుంది. అంతేకాదు! సౌర మండలంలోని గాలులపై కూడా అధ్యయనం చేయనుంది. సౌర తుఫాన్ల సమయంలో వెలువడే రేణువులతో పాటు కాంతిమండలం, వర్ణమండలంపై పరిశోధనలు చేయనుంది.