SNP
SNP
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపింది.. చంద్రబాబు అరెస్ట్. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ స్కీల్ డెవలప్‌మెంట్ కోసం నిధులు కేటాయింపులో అవినీతికి పాల్పడినట్లు ఏపీ సీఐడీ ఆరోపిస్తూ.. శనివారం ఆయనను నంద్యాలలో అరెస్ట్ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కెంది. ఈ రోజు ఉదయం చంద్రబాబును సీఐడీ.. విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. చంద్రబాబును రిమాండ్‌కు ఇవ్వాలని సీఐడీ తరఫు లాయర్లు, బెయిల్ కోరుతూ చంద్రబాబు తరుఫు లాయర్ల మధ్య కోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి.
ఇప్పటికైతే ఇరు వర్గాల వాదనలు పూర్తి అయ్యాయి. న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఉదయం నుంచి దాదాపు ఏడున్నర గంటల పాటు వాదనలు కొనసాగాయి. ప్రస్తుతం న్యామమూర్తి ఎలాంటి తీర్పు ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బాబుకు బెయిలా? జైలా? అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయాల వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. ఈ నేపథ్యంలో పోలీసులు విజయవాడ నుంచి రాజమండ్రి జైలుకు వెళ్లే రహదారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఆ రోడ్డు మొత్తం క్లియర్ చేశారు. పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలతో చంద్రబాబుకు రిమాండ్ విధించడం కన్ఫామ్ అయినట్లు చాలా మంది భావిస్తున్నారు. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించేందుకే రూట్‌ను క్లియర్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే.. ఇంకా తీర్పు రాని నేపథ్యంలో ఇవన్నీ ఊహాగానాలే అంటూ మరికొంతమంది కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ జనరల్ ప్రోసీజర్స్‌లో భాగంగా పోలీసులు చేపడుతున్నారని, ఒక వేళ తీర్పు రిమాండ్‌గా వస్తే.. అప్పటి కప్పుడు ఇబ్బంది పడకుండా.. ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చంద్రబాబు అరెస్ట్ అయితే మాకేంటి? ఏపీ ప్రజల తెలివికి హ్యాట్సాఫ్!