విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 60వేల ప్రైజ్ మనీ.. .. ఇలా గెలుచుకోండి!

విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో స్టూడెంట్ ఇన్నోవేషన్ కాంపిటీషన్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొని ప్రతిభకనబరిచిన వారికి కళ్లు చెదిరే నగదు బహుమతిని అందించనున్నారు. ఇందుకోసం రూ. 60వేల ప్రైజ్ మనీని ప్రకటించారు.

విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో స్టూడెంట్ ఇన్నోవేషన్ కాంపిటీషన్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొని ప్రతిభకనబరిచిన వారికి కళ్లు చెదిరే నగదు బహుమతిని అందించనున్నారు. ఇందుకోసం రూ. 60వేల ప్రైజ్ మనీని ప్రకటించారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వారి కోసం ఇన్నోవేషన్ కాంపిటీషన్స్ నిర్వహిస్తుంటారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు అంశాల మీద ఆన్ లైన్ క్విజ్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని గెలుపొందిన వారికి భారీగా నగదు బహుమతిని అందజేస్తోంది. అంతేకాకుండా సర్టిఫికేట్ తో పాటు కన్సోలేషన్ బహుమతులు కూడా అందిస్తుంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో స్టూడెంట్ ఇన్నోవేషన్ కాంపిటీషన్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొని ప్రతిభకనబరిచిన వారికి కళ్లు చెదిరే నగదు బహుమతిని అందించనున్నారు. ఇందుకోసం రూ. 60వేల ప్రైజ్ మనీని ప్రకటించారు. మరి ఈ కాంపిటీషన్ లో ఎలా పాల్గొనాలి? ఎవరు అర్హులు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

విద్యార్థులకు గుడ్ న్యూస్. మీరు ఓ కాంపిటీషన్ లో పాల్గొని రూ. 25వేలు గెలుపొందే ఛాన్స్ ఉంది. అది ఎలా అంటే.. ఆవిష్కార్ 2023 అనే స్టూడెంట్ ఇన్నోవేషన్స్ కాంపిటీషన్‌ని ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కాంపిటీషన్లను సైన్స్ సిటీ ఆఫ్ ఏపీతో కలిసి భారతీయ విజ్ఞాన మండలి నిర్వహిస్తోంది. దీనికి భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మద్దతు కల్పిస్తోంది. స్టూడెంట్ ఇన్నోవేషన్ కాంపిటీషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను వినూత్న ఆలోచన వైపు మళ్లించడం. అదే విధంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ మన జీవితాలను మెరుగుపరచడానికి పరిష్కారాలను ఎలా అందిస్తాయో చూపడం దీని అంతిమ లక్ష్యం.

కాగా ఆవిష్కార్ 2023 అనే స్టూడెంట్ ఇన్నోవేషన్స్ కాంపిటీషన్‌ లో పాల్గొనేందుకు ఏపీలోని యూజీ లేదా పీజీ కోర్సులు చేస్తున్నవారు అర్హులు. యువ గ్రాడ్యుయేట్లు వారి ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రదర్శించడానికి మూడు కాంపీటీషన్లను ప్రవేశపెట్టారు. అందులో 1. వర్కింగ్ మోడల్ కాంపిటీషన్‌. 2. ఇన్నోవేటివ్ ఐడియా కాంపిటీషన్‌. 3. బిజినెస్ మోడల్ కాంపిటీషన్‌. ఈ పోటీలలో పాల్గొనదలిచిన స్టూడెంట్స్ https://forms.gle/BNbKeHrJ3cnkY5KPA లింక్ ద్వారా తమ పేర్లను నమోదు చేయించుకోవాల్సి ఉంది. ఇందుకు చివరి తేదీ ఫిబ్రవరి 15, 2024. ఫిబ్రవరి 25న స్క్రూటినీ, సెలక్షన్ ఉంటుంది. ఆ తర్వాత మార్చి 16, 17 తేదీల్లో స్టేట్ లెవెల్ కంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్ లో గెలుపొందిన వారికి ఫస్ట్ ప్రైజ్ రూ.25వేలు, సెకండ్ ప్రైజ్ రూ.20వేలు, థర్డ్ ప్రైజ్ రూ.15వేలు అందిస్తారు. ఈ కాంపిటీషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం www.bvmap.org ని పరిశీలించాల్సి ఉంటుంది.

Show comments