iDreamPost

మందు బాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్! కీలక ఆదేశాలు!

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్. ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెంచే మార్గాలపై జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించగా.. కీలక నిర్ణయం తీసుకున్నారు.

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్. ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెంచే మార్గాలపై జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించగా.. కీలక నిర్ణయం తీసుకున్నారు.

మందు బాబులకు తెలంగాణ సర్కార్  గుడ్ న్యూస్! కీలక  ఆదేశాలు!

మగవాళ్ల మోస్ట్ ఫేవరేట్ డ్రింక్.. మద్యం. పొద్దు పొడిచిన వెంటనే ప్రస్టేషన్ తీర్చుకునేందుకు, బాధను, కష్టాలను మర్చిపోయేందుకు ఆశ్రయించే ఆశ్రమాలు.. బార్ అండ్ రెస్టారెంట్స్, లిక్కర్, మద్యం దుకాణాలు. ఇక మద్యం ప్రియుల సంగతైతే చెప్పనక్కర్లేదు..తెల్లారింది మొదలు.. షాపులు కూడా తెరవకుండానే.. దుకాణాల ముందు వాలిపోతుంటారు. నాలుక జివ్వుమంటూ లాగేస్తుంటుందో ఏమో తెలియదు కానీ చుక్క పడనిదే.. రోజు మొదలు కాదు వారికి. తీర్థం తీసుకోకపోతే మనస్సంతా ఏదో కోల్పోయామన్న దిగులు, చింత, ఆవేదన ఉంటుంది. అది కాస్త అప్పుడప్పుడు ఫ్యామిలీపై చూపిస్తుంటారు. అలాంటి మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.

ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సచివాలయంలో జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎక్సైజ్, టూరిజం శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెంచే మార్గాలపై సమాలోచనలు చేయగా.. మద్యం ధరల్ని పెంచొద్దని పేర్కొన్నారు భట్టి విక్రమార్క. మద్యం ధరలను పెంచకుండా ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెంచే మార్గాలను, అందుబాటులో ఉన్న వనరులను గుర్తించాలని తెలిపారు. అలాగే ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలపైనే కాకుండా కట్టడి చేసే ప్రణాళికలు రూపొందిచాలని సూచించారు. ఎలైట్ బార్లతో పాటు ఎలైట్ షాప్‍ల విషయంలో ఏకీకృత విధానాలను అమలు చేయాలన్నారు. రాష్ట్రమంతా ఒకే నిబంధనలు ఉండేలా మార్గదర్శకాలు ఉండాలని సూచించారు. ఈ లెక్క ప్రకారం మద్యం ధరలు పెరగనట్లే.

అలాగే పోలీసు, సమాచార శాఖలతో కలిసి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి డ్రగ్స్ కట్టడి చేయాలని ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని, అందుకు అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. డ్రగ్స్ వినియోగదారులను గుర్తించాలని, దీన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క తెలిపారు. దేవాలయాలు, ఎకో టూరిజం అభివృద్ధికి అవకాశాలను అన్వేషించాలన్నారు. దేవాలయాల టూరిజం అభివృద్ధికి దేవాదాయ, పర్యాటక, ఆర్టీసీ శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ పర్యాటకులకు తెలియజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచలను చేశారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి