iDreamPost

Hanuman: హనుమాన్ సినిమాకు రాజా సింగ్ మద్దతు! మన బాధ్యతంటూ..

  • Published Jan 08, 2024 | 2:26 PMUpdated Jan 08, 2024 | 2:26 PM

ఈ సంక్రాంతి కానుకగా యువ హీరో తేజ సజ్జ నటించిన 'హనుమాన్' విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రానికి తన సపోర్ట్ ను అందిస్తూ తెలంగాణ ఎమ్మెల్యే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సంక్రాంతి కానుకగా యువ హీరో తేజ సజ్జ నటించిన 'హనుమాన్' విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రానికి తన సపోర్ట్ ను అందిస్తూ తెలంగాణ ఎమ్మెల్యే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Published Jan 08, 2024 | 2:26 PMUpdated Jan 08, 2024 | 2:26 PM
Hanuman: హనుమాన్ సినిమాకు రాజా సింగ్ మద్దతు! మన బాధ్యతంటూ..

ఈ ఏడాది సంక్రాంతి బరిలో సిద్ధంగా ఉన్న చిత్రాలలో ‘హనుమాన్’ఒకటి. కొంతమంది అగ్రహీరోలతో పాటు యువ హీరో తేజ సజ్జ కూడా ఈసారి పోటీ పడుతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులకు అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే సంక్రాంతికి ఒకేసారి నాలుగు సినిమాలు విడుదల కావడంతో.. థియేటర్ డిస్ట్రిబ్యూషన్స్ లో కొన్ని ఇబ్బందులు తలెత్తున్నాయని సమాచారం. గతంలో కూడా దీనిపై చర్చలు జరిగాయి. ఈ క్రమంలో జనవరి 12న ‘హనుమాన్’ చిత్రం థియేటర్ లలో విడుదల చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. అయితే, ఈ చిత్రానికి మద్దతు ఇవ్వడం మన బాధ్యత అంటూ.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

కాగా, ‘హనుమాన్’ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ .. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. సంక్రాంతి బరిలో అగ్ర హీరోల చిత్రాలు కూడా ఉన్నప్పటికీ .. ఏ మాత్రం బెరుకు లేకుండా ‘హనుమాన్’ కూడా అదే సమయంలో విడుదలకు సిద్ధం అయింది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజ సజ్జ కాంబినేషన్ రాబోతున్న.. ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఏ రకంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి మరి. అయితే, ఈ సినిమాకు మన వంతు మద్దతు ఇవ్వాలి అంటూ .. ఈ విషయమై మాట్లాడుతూ.. “హనుమాన్ వంటి గొప్ప చిత్రాలు దేశానికి, హిందూ మతం గొప్పతనానికి గుర్తింపును తీసుకొస్తాయి. శ్రీ రాముని పరమ భక్తుడైన హనుమంతుడి ఆశీర్వాదం.. పొందిన ఓ యువకుడి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. కాబట్టి ఇటువంటి ఓ గొప్ప ప్రయత్నానికి అందరూ తప్పకుండా అండగా నిలవాలి.” అంటూ రాజా సింగ్ పేర్కొన్నారు. అంతే కాకుండా హనుమాన్ చిత్ర బృందం మరో గొప్ప నిర్ణయం కూడా తీసుకుంది.

ఆ శ్రీ రామునికి ప్రేమ భక్తుడైన హనుమంతుడి ఆశీస్సులతో .. ఓ యువకుడి కథగా ఈ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అతి త్వరలో కొన్ని కోట్లమంది భక్తులు ఎదురుచూస్తున్న మహా ఘట్టం.. అయోధ్యలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట. కాబట్టి ఈ నేపథ్యంలో ‘హనుమాన్’చిత్రాన్ని విడుదల చేసిన తర్వాత.. అమ్ముడుపోయిన ప్రతి టికెట్ పై రూ. 5 లను అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తామని.. చిత్ర బృందం తెలిపారు. ఈ విషయానికి మెగాస్టార్ చిరంజీవి సైతం చిత్ర బృందాన్ని అభినందించారు. కాగా, ఈ చిత్రంలో తేజ సజ్జ, అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాలో నటించారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఇక, సంక్రాంతి బరిలో హనుమాన్ ఏ స్థానాన్ని సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి, తెలంగాణ ఎమ్మెల్యే ‘హనుమాన్’ చిత్రానికి సంబంధించి చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి