iDreamPost

APకి ప్రత్యేక హోదా ఇవ్వాలి..తెలంగాణ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ మంత్రి అన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. మరి.. ఆ మంత్రి ఎవరు?.. ఆ వివరాలు ఏమిటిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ మంత్రి అన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. మరి.. ఆ మంత్రి ఎవరు?.. ఆ వివరాలు ఏమిటిటో ఇప్పుడు తెలుసుకుందాం..

APకి ప్రత్యేక హోదా ఇవ్వాలి..తెలంగాణ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్ని ప్రధాన పార్టీలు కేంద్రానికి చెబుతున్నాయి. అంతేకాక రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో ఉపయోగపడుతుందని ఎంతో మంది మేధావులు, రాజకీయ నాయకులు చెబుతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశంపైనే దృష్టి సారించలేదు. 2014 జూన్ లో ఏపీ విభజన జరిగింది. ఆ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికి భాజపా కూడా మద్దతు తెలిపింది. అయితే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటిన హోదా అంశంపై కేంద్రం అసలు దృష్టి సారించడం లేదు. ఎన్నో సార్లు మన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు సైతం కేంద్రానికి విన్నవించారు. అయితే తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ మంత్రి ఒకరు చెప్పారు. మరి.. ఆ మంత్ర ఎవరు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మాములుగా తెలంగాణ మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు తరచూ ఏపీ పై హేళనగా కామెంట్సే చేసేవారు. రోడ్లు సరిగ్గా లేకుంటే… అది ఏపీ అని, చక్కగా ఉంటే తెలంగాణ అని ఒక మాజీ మంత్రి అన్నారు. అలానే చీకటిగా ఉంటే ఏపీ అని.. కరెంట్ ఉంటే తెలంగాణ అని మరోకరు ఉన్నారు. ఇలా ఏదో ఒక విషయంలో తెలంగాణాలోని కొందరు నేతలు ఏపీపై హేళనగా వ్యాఖ్యలు చేసిన ఘటనలు అనేకం జరిగాయి. అయితే తాజాగా ఏర్పడిన ప్రభుత్వంలో ఓ  మంత్రి మాత్రం ఏపీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అందులోనూ ఏపీకి ప్రత్యేక హోదా రావాలని కోరారు. అందుకోసం తనవంతూ కృషి చేస్తానని తెలిపారు. ఆయనే తెలంగాణ రోడ్ల, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఈ నేత గురించి రాజకీయాలపై అవగాహన  ఉన్న వారికి  ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అంతేకాక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ఆర్థికంగా మద్దతు ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ ఛైర్‌ పర్సన్ సోనియా గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదాను ఇప్పటివరకూ అమలు పర్చకపోవడం బాధాకరమని మంత్రి తెలిపారు.

“మోదీ గారికి విజ్ఞప్తి. నాడు 2014 ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న ప్రధానిగా దాన్ని అమలుపరిచే బాధ్యత మీదే. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మీరు కూడా ఏపీకీ వెళ్లినప్పుడు చెప్పారు. దాన్ని వెంటనే అమలు పర్చాలని డిమాండ్ చేస్తున్నాం’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రి వ్యాఖ్యలకు ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది కదా సోదర భావం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. తెలంగాణ మంత్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి