iDreamPost

స్త్రీల వస్త్రాధారణపై హోంమంత్రి మహమూద్ అలీ సంచలన కామెంట్స్!

  • Author Soma Sekhar Published - 04:52 PM, Sat - 17 June 23
  • Author Soma Sekhar Published - 04:52 PM, Sat - 17 June 23
స్త్రీల వస్త్రాధారణపై హోంమంత్రి మహమూద్ అలీ సంచలన కామెంట్స్!

స్త్రీల వస్త్రాధారణపై తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న హైదరాబాదులో చెలరేగిన హిజాబ్ వివాదంపై ఆయన తాజాగా స్పందించారు. ఈ క్రమంలోనే మహిళల వస్త్రాధారణపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. తాజాగా కేవీ రంగారెడ్డి కాలేజ్ లో ఉర్దూ పరీక్ష రాసేందుకు కొంత మంది ముస్లిం విద్యార్థినిలు వచ్చారు. ఈ క్రమంలోనే వారిని హిజాబ్ తీసి పరీక్షకు హాజరుకావాలని కాలేజ్ సిబ్బంది కోరారు. దాంతో అక్కడ వివాదం చెలరేగింది. ఈ విషయంపై విద్యార్థినిలు హోంమంత్రికి ఫిర్యాదు చేయగా.. తాజాగా ఆయన హిజాబ్ వివాదంపై స్పందించారు.

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మహిళల వస్త్రాధారణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న కేవీ రంగారెడ్డి కాలేజ్ లో జరిగిన హిజాబ్ వివాదంపై ఆయన స్పందించారు. ముస్లీం మహిళలను బుర్ఖా వేసుకోవద్దు అని ఎవ్వరూ చెప్పలేదన్నారు.పొట్టి దుస్తులు ధరించడం వల్లే అనేక సమస్యలు వస్తున్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి. హిందూ మహిళల తరహాలోనే ముస్లిం స్త్రీలు కూడా దుస్తులు వేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. అసలు వివాదం ఏంటంటే?

కేవీ రంగారెడ్డి కాలేజ్ లో ఉర్దూ పరీక్ష రాసేందుకు కొందరు ముస్లిం విద్యార్థినిలు వచ్చారు. ఆ టైమ్ లో వారు హిజాబ్ ధరించి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాలేజ్ సిబ్బంది ఆ విద్యార్థినిలను హిజాబ్ తీసి వస్తేనే పరీక్ష రాయనిస్తామని చెప్పారు. దాంతో స్టూడెంట్స్, తల్లిదండ్రులు కలిసి కాలేజ్ యాజమాన్యంతో గొడవకు దిగారు. అయినప్పటికీ కళాశాల యాజమాన్యం పట్టు విడవలేదు. హిజాబ్ తీసేసి వస్తేనే పరీక్షరాయనిస్తామని చెప్పేసింది. దాంతో చేసేది ఏమీ లేక విద్యార్థినిలు హిజాబ్ తీసేసి ఎగ్జామ్ రాశారు. ఇక ఈ విషయంపై హోంమంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు చేశారు విద్యార్థినిలు. దాంతో ఈ విషయంపై మాట్లాడుతూ.. తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మహమూద్ అలీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి