iDreamPost

TS Budget 2024: రూ.2లక్షల రుణమాఫీ.. రూ.500లకే Gas సిలిండర్.. ఎప్పటినుంచంటే?

నేడు అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అందించింది. రూ. 2 లక్షల రుణమాఫీ, రూ. 500కే గ్యాస్ సిలిండర్ పై కీలక నిర్ణయం తీసుకుంది.

నేడు అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అందించింది. రూ. 2 లక్షల రుణమాఫీ, రూ. 500కే గ్యాస్ సిలిండర్ పై కీలక నిర్ణయం తీసుకుంది.

TS Budget 2024: రూ.2లక్షల రుణమాఫీ.. రూ.500లకే Gas సిలిండర్.. ఎప్పటినుంచంటే?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారం చేపట్టింది కాంగ్రెస్. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలుచుకుని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి డిసెంబర్ 07న ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరుగ్యారంటీల అమలుకు ప్రణాళికలు వేస్తూ రేవంత్ సర్కార్ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ఓట్ ఆన్ అకౌంట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సారానికి సబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైతులకు శుభవార్తను అందించారు. త్వరలోనే రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు రూ. 53,196 కోట్లు అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా.. రాష్ట్రాభివృద్ధికి దోహద పడే విధంగా బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిపారు. దీనిలో భాగంగానే రుణమాఫీ, రూ. 500కే గ్యాస్ సిలిండర్ పై కీలక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులను ఆదుకునేందుకు రుణమాఫీపై ప్రత్యేక దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. ప్రతి రైతుకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని త్వరలోనే కార్యాచరణ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇందుకోసం వ్యవసాయ శాఖకు రూ. 19,746 కోట్లు నిధులు సమకూర్చినట్లు తెలిపారు.

కౌలు రైతులకు ఉచిత భీమా వర్తింపజేస్తామని ప్రకటించారు. రైతు కూలీలను ఆదుకుంటామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని వెల్లడించారు. త్వరలోనే ఈ హామీలను నెరవేర్చేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని స్పష్టం చేశారు. ధరణి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఇక ఆరు గ్యారంటీల హామీల్లో ఇప్పటికే రెండు హామీలు అమలవుతుండగా త్వరలోనే రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రుణమాఫీ కూడా అమలు చేయనుండడంతో తెలంగాణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి