iDreamPost

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇప్పుడు వాళ్లు కూడా అర్హులే!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు ఊరట కటిగేలా ఉద్యోగ నియామకాల కోసం వయోపరిమితిని పెంచింది. ప్రభుత్వ నిర్ణయంతో వారికి మరోసారి అవకాశం దక్కినట్లైంది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు ఊరట కటిగేలా ఉద్యోగ నియామకాల కోసం వయోపరిమితిని పెంచింది. ప్రభుత్వ నిర్ణయంతో వారికి మరోసారి అవకాశం దక్కినట్లైంది.

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇప్పుడు వాళ్లు కూడా అర్హులే!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఉద్యోగ నియామకాలపై దృష్టిసారించిన రేవంత్ సర్కార్ వేగంగా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో అవకతవకలకు నిలయమైన టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ ను, సభ్యులను నియమించింది. గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని, జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా జాప్యం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. వయోపరిమితి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో వారికి మరోసారి అవకాశం దక్కినట్లైంది.

ఇటీల తెలంగాన సర్కార్ 6 వేలకు పైగా స్టాఫ్ నర్స్ లకు నియామక పత్రాలను అందించిన విషయం తెలిసిందే. త్వరలోనే రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. త్వరలోనే పోలీస్ డిపార్టుమెంట్ లో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ క్రమంలో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు వయోపరిమితిని పెంచింది. ఈ నిర్ణయంతో ఏజ్ దాటిపోయిన వారికి మరో ఛాన్స్ వచ్చినట్లైంది.

తాజాగా రేవంత్ సర్కార్ ఉద్యోగాలకు వయోపరిమితిని రెండు సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వయోపరిమితి 44 ఏళ్లు ఉండగా దీనిని 46 ఏళ్లకు పెంచింది. అయితే వయోపరిమితి పెంపును యూనిఫామ్‌ సర్వీసుకులకు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీలు, నోటిఫికేషన్ల జాప్యం కారణంగా ఏళ్లకేళ్లు ప్రిపేర్ అయిన నిరుద్యోగులు నిరాశకు గురయ్యారు. ఏజ్ లిమిట్ దాటిపోయిన ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోయిన వారు చాలామందే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వయోపరిమితిని పెంచడంతో వారందిరికీ మరోసారి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే అవకాశం దక్కింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం నిరుద్యోగులకు లాభం చేకూరేలా వయోపరిమితిని పెంచింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి