iDreamPost

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్… ఇళ్లు కట్టుకుంటే రూ. 5లక్షలు..!

Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం ఐదు గ్యారెటీల్లో భాగంగా వివిధ పథకాలను అమలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. ఇప్పటికే మహలక్ష్మి పథకం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటి స్కీమ్స్ ను అమలు చేస్తుంది. తాజాగా ఇళ్లు కట్టుకునే వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం ఐదు గ్యారెటీల్లో భాగంగా వివిధ పథకాలను అమలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. ఇప్పటికే మహలక్ష్మి పథకం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటి స్కీమ్స్ ను అమలు చేస్తుంది. తాజాగా ఇళ్లు కట్టుకునే వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్… ఇళ్లు కట్టుకుంటే రూ. 5లక్షలు..!

ప్రతి ఒక్కరి సొంతిల్లు ఉండాలనే కోరుకుంటారు. చాలా మందికి పేదలకు సొంత ఇళ్లు లేక అనేక ఇబ్బందులకు గురవుతుంటారు.ఈక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు కోసం అనేక పథకాలను తీసుకొస్తున్నాయి. అలానే ఇళ్లను సైతం పేదల ప్రజలకు అందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా పేద ప్రజలు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. తెలంగాణలో ఇళ్లులేని పేదలకు ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని గతంలో రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో భాగంగా.. ఖాళీ స్థలాల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది.  అలానే ఇళ్ల స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం కూడా అందిస్తామని తెలిపింది.  ఇలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 గృహాల చొప్పున  ప్రతి ఏడా 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని  రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. అలానే రాష్ట్ర రిజర్వు కోటా కింద మరో 33,500 ఇళ్లను కేటాయించింది. తొలి ఏడాది ఇళ్ల నిర్మాణం కోసం రూ. 7,740 కోట్లు ఖర్చు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించింది.

ఇలా ఇళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం  ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.  ఇళ్ల నిర్మాణాలకు తొలిదశలో రూ.3వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం హామీతో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థకు రుణం ఇచ్చేందుకు హడ్కో పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. గత నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్రప్రభుత్వం సూత్రప్రాయంగా ప్రారంభించగా.. లోక్ సభ ఎన్నికలు ముగిసిన అనంతరం అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు కూడా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా హడ్కో నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించి ప్రతిపాదనలను పంపింది. ఇక ఆర్థిక సాయం అందిచే విషయంలో కొన్ని కీలక  విషయాలను పేర్కొంది.

పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు.. సెంట్రల్ గవర్నమెంట్ రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. ఆ మొత్తాన్ని సమీకరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు  కోసం సుమారు రూ.5000 కోట్ల రుణం కోసం  ప్రతిపాదనలు పంపగా.. రూ.3000కోట్ల రుణం మంజూరు చేసేందుకు హడ్కో ఒప్పుకుంది. ఈనేపథ్యంలో తొలిదశలో రూ.850 కోట్లు విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈనేపథ్యంలో గతంలో ప్రకటించినట్లు ఇళ్ల కట్టుకునే వారికి రూ.5 లక్ష ఆర్థిక సాయం రేవంత్ సర్కార్ చేయనున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి