iDreamPost

TS Eamcet 2022 Results: తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు వ‌చ్చేశాయ్

TS Eamcet 2022 Results: తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు వ‌చ్చేశాయ్

తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ సెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎసెంట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో 88.34 శాతం మంది అర్హ‌త‌సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఫలితాలను విడుదల చేశారు.

ఇంజనీరింగ్ లో ఫస్ట్‌ ర్యాంక్ లక్ష్మీసాయి లోహిత్ , సెకండ్‌ ర్యాంక్ ను సాయిదీపిక, థర్డ్‌ ర్యాంక్ ను కార్తికేయ సాధించారు.

ఇక అగ్రికల్చర్ లో ఫస్ట్‌ ర్యాంక్ ను నీహ, సెకండ్‌ ర్యాంక్ ను రోహిత్‌, థర్డ్‌ ర్యాంక్ ను తరుణకుమార్ సాధించారు.

జులై 18 – 20వ తేదీ వరకు ఎంసెట్‌ ఇంజనీరింగ్ , 30, 31 తేదీల్లో అగ్రి, మెడికల్‌ ఎంసెట్ ను నిర్వ‌హించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ విభాగానికి 1.52 లక్షలమంది, అగ్రి ఎంసెట్‌కు 80 వేలమంది ఎగ్జామ్ కు హాజ‌రైయ్యారు.

విజ‌యం సాధించిన విద్యార్ధుల‌కు మంత్రి స‌బిత శుభాకాంక్ష‌లు తెలిపారు. ఉన్న‌త విద్యామండ‌లి ఆధ్వ‌ర్యంలో త్వ‌ర‌లో ఎర్పాటు చేసే కౌన్సిలింగ్ సెంట‌ర్ లో కాలేజీలు, కోర్సుల వివ‌రాల‌ను వెల్ల‌డిస్తార‌ని మంత్రి తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి