iDreamPost

తెలంగాణ: మందుబాబులకు గుడ్‌ న్యూస్‌.. కీలక ప్రకటన చేసిన డిప్యూటీ CM

  • Published Jan 23, 2024 | 9:32 AMUpdated Jan 23, 2024 | 9:47 AM

Liquor Rates: తెలంగాణ మందు బాబులకు కాంగ్రెస్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆ వివరాలు..

Liquor Rates: తెలంగాణ మందు బాబులకు కాంగ్రెస్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆ వివరాలు..

  • Published Jan 23, 2024 | 9:32 AMUpdated Jan 23, 2024 | 9:47 AM
తెలంగాణ: మందుబాబులకు గుడ్‌ న్యూస్‌.. కీలక ప్రకటన చేసిన డిప్యూటీ CM

తెలంగాణలోని మందబాబులకు కాంగ్రెస్‌ సర్కార్‌ మాంచి కిక్కెచ్చేలాంటి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ క్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మద్యం ధరల్ని పెంచవద్దని మల్లు భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. మద్యం ధరలను పెంచకుండా ఎక్సైజ్‌ శాఖ ఆదాయాన్ని పెంచే మార్గాలను, అందుబాటులో ఉన్న వనరులను గుర్తించాలని తెలిపారు. ప్రీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా సచివాలయంలో ఎక్సైజ్, టూరిజం శాఖల అధికారులతో సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ శాఖ మద్యం విక్రయాలపైనే కాకుండా కట్టడిపైనా కూడా దృష్టి పెట్టాలని కోరారు.

ఎలైట్‌ బార్‌లతో పాటు ఎలైట్‌ షాప్‌ల విషయంలో ఏకీకృత విధానాలను అమలు చేయాలని ఆదేశించారు భట్టి విక్రమార్క. అంతేకాక మద్యం అమ్మకాలకు సంబంధించి ఒకే రకమైన నిబంధనలు అమలయ్యేలా మార్గదర్శకాలు రూపొందించాలని ఎక్సైజ్‌ శాఖ అధికారులకు సూచించారు. పోలీస్, సమాచార శాఖలతో కలిసి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకుని మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సరఫరా, వినియోగం వంటి అంశాలను కట్టడి చేయాలని ఆదేశించారు. ఇందుకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు కఠినచర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

good news for wine lovers

టూరిజం అభివృద్ధికి సూచనలు..

రాష్ట్రంలో పురాతన కట్టడాలు, దేవాలయాలు ఉన్న ప్రదేశాల్లో టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి గల అవకాశాలను అన్వేషించాలన్నారు. టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి దేవాదాయ, పర్యాటక, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. సహజసిద్ధమైన పర్యాటక ప్రదేశాలకు సంబంధించి సరైన ప్రచారం, మార్కెటింగ్‌ విధానం లేకపోవడం వల్ల వాటిని వినియోగించుకోలేక పోతున్నామన్నారు.

తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ పర్యాటకులకు తెలియజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. టూరిజం ప్రాజెక్టులను ప్రభుత్వమే చేపట్టలేదని, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ప్రైవేటు కంపెనీల పెట్టుబడులకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు. రీజినల్ రింగు రోడ్డు, మూసీ సుందరీకరణతో పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధి పెరుగుతుంది అన్నారు.

అంతేకాక సంపద సృష్టిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధికి పలు సూచనలు చేస్తూ ఆ కౌన్సిల్‌ బృందం నివేదిక ఇచ్చింది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తగ్గించాలని, జీవో 50ని రద్దు చేయాలని, టీఎస్‌బీపాస్‌ కింద రంగారెడ్డి జిల్లాలో పెండింగులోని పలు ప్రాజెక్టుల దరఖాస్తులు పరిష్కరించాలని నివేదకలో వెల్లడించించింది.

అంతేకాక గత ఆరు నెలలుగా పర్యావరణ పరిరక్షణ కమిటీ లేదని.. వెంటనే దాన్ని ఏర్పాటు చేయాలని నివేదికలో విజ్ఞప్తి చేసింది. నిర్మాణాల కోసం తాత్కాలిక విద్యుత్తు కనెక్షన్‌ ఛార్జీలను తగ్గించాలని కౌన్సిల్‌ బృందం కోరింది. వారి అభ్యర్థనలు తెలుసుకున్న భట్టి.. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని తెచ్చే సంపద సృష్టికర్తలను ఏమాత్రం ఇబ్బంది పెట్టబోమని స్పష్టం చేశారు. వారు ఎదురొంటున్న సమస్యలను తీర్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి