iDreamPost

RIP Sirivennela Garu : కన్నీళ్లు రాలగలవ్ కానీ రాయలేవుగా

RIP Sirivennela  Garu : కన్నీళ్లు రాలగలవ్ కానీ రాయలేవుగా

ఆ దేవుడు..ఆకాశాన ఉన్న దేవుడే..భూమి మీద దేవుడే.. ఎక్కడ ఉన్నా ఆయన్ని సమానంగా కొలుస్తాం.

కలం.. కేవలం కాగితం మీద రాయడానికి మాత్రమే కాదు.. జీవితాలని మార్చే ఒక పదునైన ఆయుధం.

మనిషికి దేవుడికి ఒక అనుబంధం..కాగితానికి కాలానికి ఒక అనుబంధం. అలాంటి అనుబంధమే సీతారామశాస్త్రి గారిది – కిషోర్ తిరుమల గారిది.

వారు మాట్లాడుకున్న మాటలు..సందర్చించిన ప్రదేశాలు..కలిసి నడిచిన సమయాలు ..పరవసింపజేసేలా రాసిన పదాలు..చివరిగా, వీడలేక విడిపోతున్న ఆఖరి క్షణాలు. కొన్ని బాధలు చెబితే అర్ధం కావు..అనుభవిస్తే తప్ప. తాను అనుభవించిన బాధని మాట రూపంలో, బరువెక్కిన హృదయంతో వ్యక్తపరిచారు దర్శకుడు తిరుమల కిషోర్.

“తెలుగు సినీ పరిశ్రమకు మీ సాహిత్యంలో నిత్యం సిరివెన్నెలని కురిపించిన, శ్రీ పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు..ఈ క్షణం..దేవుడు లేడు అన్న భయం ఎంతో..మీరు మాతో లేరు అన్న నిజం అంతే…మీ పాటల వల్ల ప్రేమించాం..ప్రేమ విఫలమైతే ఆ బాధని కూడా మళ్ళీ మీ పాటల వల్ల ప్రేమించాం… ఓడిపోయినా మీరే..గెలిచినా మీరే..ఆగిన మీరే..ఆగకుండా పరిగెత్తిన మీరే..ప్రస్తుతం కన్నీళ్లు ఆగట్లేదు..కన్నీళ్లు రాలగలవ్ కానీ..రాయలేవుగా..మీరు లేని లోటు..మీరు లేరన్న బాధ.. రాయాలంటే మీరే స్వామి..మేము ఎంత మిస్ అవుతున్నామో..అంత కంటే ఎక్కువగా కలం కాగితం మిమ్మల్ని మిస్ అవుతోంది. REST IN PEACE SIR.. – మీ తిరుమల కిషోర్.

తిరుమల కిషోర్ గారు రాసిన ప్రతి మాటలో ఆయన అనుభవిస్తున్న బాధ స్పష్టంగా కనిపిస్తుంది. సంబంధం లేని వారు కాలం చేస్తేనే ఓర్చుకోలేని మనిషి జన్మ మనది..హృదయంలో ఉన్న మనిషి లేకపోతే ఆ హృదయానికి కలిగే బాధ కిషోర్ గారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కాలం చేశారన్న మాటే జీర్ణించుకోలేకపోతుంది సినీ, సాహిత్య లోకం. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా..తెలుగు భాష ఉన్నంత కాలం..సాహిత్యం ఉన్నంతకాలం..మాట ఉన్నంత కాలం..పాట ఉన్నంత కాలం. ఆ వెన్నెల ఉన్నంత కాలం.. మన సిరివెన్నెల బ్రతికే ఉంటారు..మన మధ్యే ఉంటారు.

Also Read : ‘పదం’ ఆగిపోయింది..’స్వరం’ మూగబోయింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి