iDreamPost

Suresh Raina: రింకూ, గిల్ లాంటోళ్లు ఎందరున్నా సరిపోరు.. వాళ్లిద్దర్నీ దింపాల్సిందే: రైనా

  • Published Jan 11, 2024 | 6:36 PMUpdated Jan 11, 2024 | 6:36 PM

టీ20 వరల్డ్ కప్-2024​లో భారత్ విజేతగా నిలవాలంటే ఆ ఇద్దరు ప్లేయర్లను బరిలోకి దింపాల్సిందేనని సురేష్ రైనా అన్నాడు. వాళ్లిద్దరూ ఆడితే కప్పు మనదేనని చెప్పాడు.

టీ20 వరల్డ్ కప్-2024​లో భారత్ విజేతగా నిలవాలంటే ఆ ఇద్దరు ప్లేయర్లను బరిలోకి దింపాల్సిందేనని సురేష్ రైనా అన్నాడు. వాళ్లిద్దరూ ఆడితే కప్పు మనదేనని చెప్పాడు.

  • Published Jan 11, 2024 | 6:36 PMUpdated Jan 11, 2024 | 6:36 PM
Suresh Raina: రింకూ, గిల్ లాంటోళ్లు ఎందరున్నా సరిపోరు.. వాళ్లిద్దర్నీ దింపాల్సిందే: రైనా

ఈ ఏడాది క్రికెట్​లో బిగ్ టోర్నమెంట్ జరగనుంది. అదే టీ20 వరల్డ్ కప్. జూన్​లో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం టీమ్స్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేశాయి. టీమిండియా కూడా పొట్టి ఫార్మాట్​లో జరిగే ప్రపంచ కప్​ను ఎగరేసుకుపోవాలని అనుకుంటోంది. అయితే మిగిలిన దేశాల కంటే భారత్​కు సన్నాహకాలకు ఎక్కువ టైమ్ లేదు. ఆఫ్ఘానిస్థాన్​తో స్టార్ట్ అయ్యే మూడు టీ20ల సిరీసే ఈ ఫార్మాట్​లో ఆఖరి సిరీస్ కానుంది. ఆ తర్వాత ఐపీఎల్​ షురూ కానుంది. టీమ్ కాంబినేషన్ సెట్ చేసుకోవడానికి ఇదే ఆఖరి ఛాన్స్. ఈ తరుణంలో బ్రహ్మ్రాస్త్రాలను బయటకు తీసింది బీసీసీఐ. ఆడతారో లేదోననే డౌట్ ఉన్న ఇద్దరు ఛాంపియన్ ప్లేయర్లను బరిలోకి దింపుతోంది. వాళ్లే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తారనుకుంటున్న వేళ పొట్టి ఫార్మాట్​లో ఆడేందుకు వీళ్లను ఒప్పించింది. ఆఫ్ఘాన్​తో సిరీస్​కు వీళ్లను సెలక్ట్ చేసింది. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్, కోహ్లీ ఉంటే వరల్డ్ కప్ మనదేనన్నాడు.

టీ20ల్లోకి కోహ్లీ, రోహిత్​ కమ్​బ్యాక్ ఇచ్చేలా చేసిన బీసీసీఐని రైనా మెచ్చుకున్నాడు. టీ20 వరల్డ్ కప్​కు ఆతిథ్యం ఇవ్వనున్న యూఎస్​ఏ, కరీబియన్ దీవుల్లో పరిస్థితులు క్లిష్టంగా ఉంటాయని.. అక్కడ వీళ్లిద్దరి అనుభవం టీమ్​కు ఎంతో పనికొస్తుందన్నాడు. ‘వరల్డ్ కప్​కు ఆతిథ్యం ఇస్తున్న యూఎస్​ఏ, వెస్టిండీస్​లో వికెట్లు కాస్త ట్రికీగా ఉంటాయి. అక్కడ రోహిత్, కోహ్లీల ఎక్స్​పీరియెన్స్​ జట్టుకు ఎంతో అవసరం. విరాట్ టీ20 క్రికెట్​లో 12 వేల పరుగుల మార్క్​కు దగ్గర్లో ఉన్నాడు. కాబట్టి వీళ్లిద్దరూ ఉంటే టీమిండియా బలం రెట్టింపు అవుతుంది. కోహ్లీ మూడో నంబర్​లోనే బ్యాటింగ్​ చేయాలి. సవాల్ విసిరే పిచ్​ల మీద అతడు నిలబడి పట్టుదలతో బ్యాటింగ్ చేయగలడు. యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, శుబ్​మన్​ గిల్ లాంటి ఫియర్​లెస్ క్రికెటర్లు టీమ్​లో ఉన్నారు. కానీ రోహిత్, కోహ్లీని ఆడించాల్సిందే’ అని రైనా స్పష్టం చేశాడు.

if the two will play t20 world cup is ours

జైస్వాల్, రింకూ సింగ్, శుబ్​మన్ గిల్ లాంటి వాళ్లు ఎందరు టీమ్​లో ఉన్నా సరిపోరని.. కోహ్లీ, రోహిత్​ ఉంటే జట్టు దృఢంగా మారుతుందన్నాడు రైనా. వరల్డ్ కప్ లాంటి బిగ్ టోర్నమెంట్స్​లో ఎంతో ఒత్తిడి ఉంటున్నాడు. మెగాటోర్నీలో టార్గెట్ ఛేజ్ చేసే సమయంలో కోహ్లీ, రోహిత్ టీమ్​లో ఉంటే గెలుస్తామనే భరోసా కలుగుతుందన్నాడు. ఈ ఇద్దరు ప్లేయర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ టీ20 వరల్డ్ కప్​లో ఆడించాలని రైనా పేర్కొన్నాడు. కాగా, ఐసీసీ ఇటీవలే టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్​ను ప్రకటించింది. మెగా టోర్నీ జూన్​ 1వ తేదీన మొదలవుతుంది. ఫైనల్ మ్యాచ్​ బార్బడోస్​లో జరుగుతుంది. టీమిండియా జూన్​ 5న ఐర్లాండ్​తో, 9న పాకిస్థాన్​తో, 12న అమెరికాతో, 15న కెనెడాతో తలపడనుంది. టీ20 ప్రపంచ కప్​ హిస్టరీలో ఫస్ట్ టైమ్ 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మరి.. రోహిత్, కోహ్లీ ఆడితే వరల్డ్ కప్ మనదేనంటూ రైనా చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: అతనే నెం.1 ఇండియన్‌ క్రికెటర్‌! ఇంగ్లండ్‌ ప్లేయర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి