iDreamPost

Team India: అతనే నెం.1 ఇండియన్‌ క్రికెటర్‌! ఇంగ్లండ్‌ ప్లేయర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

నా దృష్టిలో భారత జట్టులో అతడే నెం.1 ప్లేయర్ అని చెప్పుకొచ్చాడు ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ మెుయిన్ అలీ. మరి ఆ ఆటగాడు ఎవరు? ఆ వివరాలు..

నా దృష్టిలో భారత జట్టులో అతడే నెం.1 ప్లేయర్ అని చెప్పుకొచ్చాడు ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ మెుయిన్ అలీ. మరి ఆ ఆటగాడు ఎవరు? ఆ వివరాలు..

Team India: అతనే నెం.1 ఇండియన్‌ క్రికెటర్‌! ఇంగ్లండ్‌ ప్లేయర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. కానీ అందులో కొందరు మాత్రమే తమ ఆటతీరుతో, వ్యక్తిత్వంతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇక సందర్భం వచ్చినప్పుడు ప్రపంచ దేశాల క్రికెటర్లు తమకు ఇష్టమైన ఆటగాళ్ల పేర్లను వెల్లడిస్తూ ఉంటారు. ఆ క్రికెటర్ కు నేను పెద్ద అభిమానినని, అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే ఎంతో ఇష్టమని, ఆ ప్లేయర్ కెప్టెన్సీకి తీరుగులేదని ఇలా తమ ప్రేమను చాటుతూ ఉంటారు. కాగా.. ఇటీవలే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు, స్టార్ ప్లేయర్ మెుయిన్ అలీ టీమిండియాలో టాప్ 5 ప్లేయర్ల లిస్ట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియాలో నెం.1 క్రికెటర్ ఎవరు అన్న ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చాడు. నా దృష్టిలో భారత జట్టులో అతడే నెం.1 ప్లేయర్ అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆ ఆటగాడు ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మెుయిన్ అలీ టీమిండియా క్రికెటర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన అతడు భారత జట్టులో అతడే నెం.1 క్రికెటర్ అంటూ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరును చెప్పుకొచ్చాడు.”నా దృష్టిలో టీమిండియాలో నెం. 1 క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని. ఎందుకంటే అతడో అద్భుతమైన ఆటగాడు. అంతకు మించి గొప్ప కెప్టెన్. తన సారథ్యంలో మూడు ఐసీసీ ట్రోఫీలను గెలవడమే కాకుండా.. ఎన్నో విజయాలు సాధించాడు” అంటూ ప్రశంసలు కురిపించాడు మెుయిన్ అలీ. కాగా.. ధోనితో పాటుగా మెుయిన్ అలీ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.

he is the number one cricketer in india

ఈ క్రమంలోనే ధోని, మెుయిన్ అలీ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అక్కడే ధోని గొప్పతనం, నాయకత్వ లక్షణాలతో పాటుగా అతడి వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాడు ఈ ఇంగ్లండ్ ఆటగాడు. అవకాశం వచ్చినప్పుడల్లా ధోనిపై ఉన్న ప్రేమను వెల్లడిస్తూనే ఉంటున్నాడు అలీ. ఇండియాలో ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. మెుయిన్ అలీ ధోని పేరును సూచించడం కొందరిని ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే టీమిండియాలో టాప్ 5 క్రికెటర్ల లిస్ట్ ను ప్రకటించాడు ఈ ఆల్ రౌండర్. ఆ జాబితాలో ధోని, కోహ్లీ, సచిన్, సెహ్వాగ్, యువరాజ్ లకు చోటు కల్పించాడు. ప్రస్తుతం ఈ ఇంగ్లండ్ ప్లేయర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇండియాలో ధోని నెం.1 క్రికెటర్ అని చెప్పిన మెుయిన్ అలీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి