iDreamPost

Rohit Sharma: అలా చేస్తే హిట్ మ్యాన్ హిస్టరీలో చిరస్థాయిగా నిలిచిపోతాడు: భారత క్రికెటర్‌

  • Author Soma Sekhar Updated - 11:23 AM, Wed - 13 December 23

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ హిట్ మ్యాన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ అలా చేస్తే.. అతడి పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చాడు.

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ హిట్ మ్యాన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ అలా చేస్తే.. అతడి పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చాడు.

  • Author Soma Sekhar Updated - 11:23 AM, Wed - 13 December 23
Rohit Sharma: అలా చేస్తే హిట్ మ్యాన్ హిస్టరీలో చిరస్థాయిగా నిలిచిపోతాడు: భారత క్రికెటర్‌

ప్రస్తుతం టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. సఫారీ గడ్డపై 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే యంగ్ టీమిండియా దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టింది. ఇక తొలి టీ20 వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. కాగా.. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలో రెండు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది టీమిండియా. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను వారి సొంతగడ్డపై ఓడించిన టీమిండియా.. దక్షిణాఫ్రికా గడ్డపై మాత్రం తడబడుతోంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ హిట్ మ్యాన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ అలా చేస్తే.. అతడి పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లను వారి గడ్డపై ఓడించి టెస్ట్ సిరీస్ విజయాలను దక్కించుకుంది టీమిండియా. కానీ సౌతాఫ్రికాలో మాత్రం టెస్ట్ సిరీస్ నెగ్గడం భారత జట్టుకు కష్టంగా మారింది. ఇప్పటి వరకు టీమిండియా సఫారీ గడ్డపై ఒక్క టెస్ట్ సిరీస్ కూడా కైవసం చేసుకోలేదు. గంగూలీ, ధోని లాంటి దిగ్గజాలకే ఈ ఘనత దక్కలేదు. కాగా.. ఈసారి రోహిత్ శర్మకు చరిత్రను తిరగరాసే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్ రోహిత్ శర్మపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సౌతాఫ్రికాను వారి గడ్డపై ఓడిస్తే.. రోహిత్ శర్మ పేరు టీమిండియా క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డాడు ఇర్ఫాన్ పఠాన్.

“సౌతాఫ్రికాను వారి సొంతగడ్డపై జయించగలిగితే.. సారథిగా రోహిత్ శర్మ పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ రెండు టెస్ట్ మ్యాచ్ లు గెలవడం అతడికి ఎంతో కీలకం. ఇప్పటి వరకు సచిన్, గంగూలీ, ధోని లాంటి దిగ్గజాలకే ఈ రికార్డు సాధ్యం కాలేదు. రోహిత్ కు ఇదే మంచి అవకాశం. గతంలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన రోహిత్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. ప్రస్తుత సిరీస్ కు కూడా అతడు అదే విధంగా రెడీ అయ్యాడని అనుకుంటున్నాను. అయితే సఫారీ పిచ్ లపై కొత్త బాల్ తో ఆడుతూ.. పరుగులు రాబట్టడం, టీమ్ ను ముందుకు నడిపించడం చాలా సవాల్ తో కూడుకున్న విషయం. ఈ టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మతో పాటుగా విరాట్ కోహ్లీ కీలకంగా మారనున్న విషయం మనందరికి తెలిసిందే” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఇర్ఫాన్ పఠాన్. కాగా.. టీమిండియా-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26 నుంచి 30 వరకు, రెండో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు కేప్ టౌన్ వేదికగా జరగనున్నాయి. మరి ఇర్ఫాన్ పఠాన్ అన్నట్లుగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టిస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి