iDreamPost

పైనల్లో ఓటమి.. డ్రెస్సింగ్ రూమ్ లో జరిగింది చెప్తూ ద్రవిడ్ ఎమోషనల్!

వరల్డ్ కప్ ఓటమి తర్వాత 140 కోట్ల మంది భారతీయులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన పరిస్థితుల గురించి రాహుల్ ద్రవిడ్ కామెంట్స్ చేశాడు.

వరల్డ్ కప్ ఓటమి తర్వాత 140 కోట్ల మంది భారతీయులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన పరిస్థితుల గురించి రాహుల్ ద్రవిడ్ కామెంట్స్ చేశాడు.

పైనల్లో ఓటమి.. డ్రెస్సింగ్ రూమ్ లో జరిగింది చెప్తూ ద్రవిడ్ ఎమోషనల్!

140 కోట్ల మంది భారతీయులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ప్రపంచకప్ కొట్టాలంటూ కన్న కలలు కల్లలుగా మిగిలాయి. టీవీల ముందు కూర్చుని చూసిన మనకే ఇలా ఉంటే? టీమిండియా జెర్సీ ధరించిం, ఇన్నిరోజులు ప్రాణం పెట్టిన ఆటగాళ్లకు ఎలా ఉంటుంది? ఇన్ని కోట్లమందికి ప్రాతినిధ్యం వహిస్తూ మువ్వన్నెల జెండాని రెపరెపలాడించాలని ఎంతగానో కృషి చేసిన జట్టు పరిస్థితి ఏంటి? ఆట ముగిసిన తర్వాత అసలు డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరిగింది? టీమిండియా ఆటగాళ్లు, స్టాఫ్ ఎలా రియాక్ట్ అయ్యింది? అనే విషయాలను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు.

టాస్ ఓడినప్పుడే క్రికెట్ ఫ్యాన్స్ లో కొంత భయం మొదలైంది. అందరూ ఊహించిన విధంగానే ఫలింత మనకు ప్రతికూలంగా వచ్చింది. 20 ఏళ్ల ప్రతీకారాన్ని తీర్చుకోవాలని చూసిన మనకు పరాభవమే మిగిలింది. అయితే అభిమానిగా మనమే ఈ ఓటమి భారాన్ని తీసుకోలేకపోతున్నాం. అలాంటింది జట్టులో ఉండి.. టీమిండియా జెర్సీ ధరించి.. మైదానంలో పోరాడిన ఆటగాళ్ల పరిస్థితి ఊహించుకుంటేనే నోట మాట రావడం లేదు. మైదానంలోనే రాహుల్ ద్రావిడ్, సిరాజ్ ఏడ్చేయడం చూశాం. కోహ్లీ, షమీ, అయ్యర్ ఇలా అందరూ ఆటగాళ్లు నీరుగారిపోయారు. ఎవరి ముఖంలో నెత్తురుచుక్కలేదు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ టైటిల్ గెలిచినా కూడా కోహ్లీ ముఖ్యంలో చిన్న చిరునవ్వు చూడలేకపోయాం. అసలు ఫైనల్లో ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ పరిస్థితి గురించి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.

“కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశకు గురయ్యాడు. జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు కన్నీళ్లు పెట్టుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్ లో ఒక విధమైన భావోద్వేగ భరిత వాతావరణ ఏక్పడింది. టీమిండియా కోచ్ గా నేను ఆ పరిస్థితిని చూడలేకపోయాను. ఈ టోర్నీ కోసం వాళ్లు ఎంతగానో కష్టపడ్డారు. ఈ ప్రపంచకప్ కోసం వాళ్లు ఎన్నో త్యాగాలు చేశారు. గత నెలరోజులుగా వాళ్లు ఆడిన ఆట నాకు తెలుసు. అయితే ఆరోజు ఏ జట్టు బాగా ఆడితే అదే గెలుస్తుంది. అయితే ఓటమి వచ్చిందని.. అక్కడితో ఆగిపోకూడదు. రాత్రి పూర్తయిన తర్వాత సూర్యూడు తిరిగి ఉదయిస్తాడు. ఈ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాం. ఆటగాళ్లకు ఎత్తుపల్లాలు సహజమే” అంటూ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. అలాగే రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కూడా దాదాపుగా ముగిసింది. తిరిగి జట్టుకి హెడ్ కోచ్ గా కొనసాగుతారా? అనే ప్రశ్నకు ద్రవిడ్ స్పందించాడు. తాను భవిష్యత్ గురించి ఎలాంటి ఆలోచన చేయలేదని చెప్పాడు. తాను కోచ్ గా కొనసాగుతానా లేదా అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ద్రవిడ్ పదీకాలంపై బీసీసీఐ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది. కొనసాగేది.. లేనిదానిపై స్పష్టత వస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి