iDreamPost

Ambati Rayudu: వీడియో: CM జగన్ కోసం అంబటి రాయుడు! ఆడుదాం ఆంధ్రలో మారువేషం!

  • Published Dec 20, 2023 | 1:57 PMUpdated Dec 20, 2023 | 2:27 PM

ఉన్నత శిఖరాలను చేరాలనుకునే యంగ్ క్రికెటర్స్​కు టీమిండియాకు ఆడిన ప్లేయర్లే స్ఫూర్తి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లను చూసి ఎంతో నేర్చుకొని తామూ ఆ స్థాయికి చేరాలని అనుకుంటారు. అలాంటి యువ ఆటగాళ్లను ఇన్​స్పైర్ చేసేందుకు భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వినూత్న ప్రయత్నం చేశాడు.

ఉన్నత శిఖరాలను చేరాలనుకునే యంగ్ క్రికెటర్స్​కు టీమిండియాకు ఆడిన ప్లేయర్లే స్ఫూర్తి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లను చూసి ఎంతో నేర్చుకొని తామూ ఆ స్థాయికి చేరాలని అనుకుంటారు. అలాంటి యువ ఆటగాళ్లను ఇన్​స్పైర్ చేసేందుకు భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వినూత్న ప్రయత్నం చేశాడు.

  • Published Dec 20, 2023 | 1:57 PMUpdated Dec 20, 2023 | 2:27 PM
Ambati Rayudu: వీడియో: CM జగన్ కోసం అంబటి రాయుడు! ఆడుదాం ఆంధ్రలో మారువేషం!

టాలెంట్ ఉన్న క్రికెటర్లు భారత్​లో ఎంతో మంది ఉన్నారు. అయితే ఇన్ని కోట్ల మందిలో 11 మందికి మాత్రమే టీమిండియాలో ఆడే ఛాన్స్ దక్కుతుంది. దాని కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. తమ చెమట, రక్తం అంతా జెంటిల్మన్ గేమ్​కు ధారపోయాలి. అప్పుడు గానీ టీమ్​లో చోటు దక్కదు. అనుక్షణం బెటర్​మెంట్​ గురించి తపన పడుతూ, తమను తాము మెరుగుపరుచుకునే వారు మాత్రమే ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ లాంటి చాలా మంది క్రికెటర్లు ప్రూవ్ చేశారు. అయితే కొంతమంది ప్లేయర్లలో తాము ఏదైనా అచీవ్ చేయగలమా? అనే డౌట్ ఉంటుంది. ముఖ్యంగా అప్పుడప్పుడే కెరీర్​ను ఎంచుకుంటున్న వారిలో ఈ భయం ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత కోచ్​ల మీద ఉంటుంది. అయితే ఈ బాధ్యతను తీసుకున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.

ఈ ఏడాది ఐపీఎల్​తో క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లకు రాయుడు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాలిటిక్స్​లో యాక్టివ్​గా ఉంటున్న ఆయన.. తాజాగా కొంత మంది యంగ్ క్రికెటర్స్​ను ఎంకరేజ్ చేస్తూ కనిపించాడు. ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మారు వేషంలో వెళ్లి యువ ఆటగాళ్లను ఆశ్చర్యపరిచాడు రాయుడు. గుబురు గడ్డం, కళ్లకు కూలింగ్ గ్లాసెస్, బారెడు పొట్టతో తన స్టైల్​ను పూర్తిగా మార్చి ఓ మ్యాచ్​కు వెళ్లాడతను. అక్కడ అంపైర్​గా వ్యవహరించాడు. బ్యాటర్ ఔట్ అయితే నాటౌట్ ఇస్తూ, నాటౌట్ అయితే ఔట్ ఇస్తూ, కరెక్ట్ బాల్​ను వైడ్​గా ఇస్తూ.. పిల్లలతో ఓ ఆటాడుకున్నాడు. రాయుడు ఇచ్చిన డెసిజన్స్​కు వాళ్లు షాకయ్యారు. అసలు అతడు అంపైరేనా? కాదా? అని వాళ్లు సందేహించారు. ఆ తర్వాత కాసేపు సరదాగా బ్యాటింగ్​ కూడా చేశాడు రాయుడు.

నాలుగైదు బంతుల్ని ఎదుర్కొన్న రాయుడు వాటిని సరిగ్గా కనెక్ట్ చేయలేదు. తాను ఎవరో తెలియకుండా ఉండాలని కావాలనే బ్యాటింగ్ రానట్లు బిహేవ్ చేశాడు. అయితే ఆ తర్వాత మాత్రం వచ్చిన ప్రతి బాల్​ను బౌండరీకి, సిక్స్​కు తరలించాడు. దీంతో గ్రౌండ్​లో ఆడుతున్న ప్లేయర్లు అందరూ షాకయ్యారు. ఎవరితను? ప్రొఫెషనల్ క్రికెటర్​లా ఆడుతున్నాడని ఆశ్చర్యపోయారు. ఆ టైమ్​లో తాను తలకు పెట్టుకున్న విగ్​తోపాటు గుబురు గడ్డం, పెద్ద పెద్ద మీసాలను తీసేశాడు. దీంతో అక్కడున్న కుర్ర క్రికెటర్లంతా షాకయ్యారు. రాయుడు, రాయుడు అంటూ వాళ్లు అరవసాగారు. డ్రెస్ ఛేంజ్ చేసుకొని వచ్చి మళ్లీ వారితో ఇంటరాక్ట్ అయ్యాడు సీఎస్​కే మాజీ బ్యాటర్. వాళ్లందరితో ఫొటోలు దిగుతూ, షేక్ హ్యాండ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేశాడు. ప్రతి రోజూ బాగా కష్టపడాలని వారికి సూచించాడు.

ఇక, వైసీపీ సర్కారు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్​ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో విన్నర్స్​కు గవర్నమెంట్ టీ షర్ట్స్ పంపిణీ చేయనుంది. ఫస్ట్ ఫేజ్​లో 17.19 లక్షల టీ షర్ట్స్​ను అందజేయనుంది. డిస్ట్రిక్ట్ కోచ్​లు, పీఈటీలు, పీడీలతో పాటు వలంటీర్లకు అంపైరింగ్, డిజిటల్ స్కోరింగ్ మీద తొలి దశలో ఇప్పటికే శిక్షణను అందించారు. ఈ మ్యాచ్​ల నిర్వహణ కోసం 9,060 స్పోర్ట్స్ గ్రౌండ్స్​ను శాప్ అధికారులు గుర్తించారు. ఈ టోర్నమెంట్​లో భాగంగానే యంగ్ క్రికెటర్స్​ను కలసి వారిని ఎంకరేజ్ చేశాడు రాయుడు. యువ ఆటగాళ్లను కలిసేందుకు రాయుడు మారువేషంలో వచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి.. రాయుడు మారువేషంలో వచ్చి సడన్ సర్​ప్రైజ్ ఇవ్వడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Robin Minz: పదో తరగతితో చదువు బంద్.. అయినా రూ.కోట్లు కొల్లగొట్టాడు! ఎవరీ రాబిన్ మింజ్?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి