iDreamPost

Mohammed Shami: టీమిండియా పేసర్ షమి కల నెరవేరింది.. మొత్తానికి తాను అనుకున్నది..!

  • Published Jan 09, 2024 | 12:34 PMUpdated Jan 09, 2024 | 12:34 PM

టీమిండియా స్పీడ్​స్టర్ మహ్మద్ షమి తాను అనుకున్నది సాధించాడు. మొత్తానికి ఇన్నాళ్లకు అతడి డ్రీమ్ నెరవేరింది.

టీమిండియా స్పీడ్​స్టర్ మహ్మద్ షమి తాను అనుకున్నది సాధించాడు. మొత్తానికి ఇన్నాళ్లకు అతడి డ్రీమ్ నెరవేరింది.

  • Published Jan 09, 2024 | 12:34 PMUpdated Jan 09, 2024 | 12:34 PM
Mohammed Shami: టీమిండియా పేసర్ షమి కల నెరవేరింది.. మొత్తానికి తాను అనుకున్నది..!

ఆటగాడైనా మొదట తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటాడు. అందుకోసం రాత్రింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తాడు. నేషనల్ టీమ్​ నుంచి పిలుపు అందుకుంటే అంతకుమించిన ఆనందం ఉండదు. అయితే దేశం తరఫున ఆడుతూ ఎన్నో ట్రోఫీలు అందుకోవాలని ప్రతి ప్లేయర్ కోరుకుంటారు. అలాగే సుదీర్ఘ కాలం సేవలు అందించినందుకు అవార్డులూ దక్కాలని కోరుకుంటారు. భారత స్టార్ పేసర్ మహ్మద్ షమి కూడా దీనికి మినహాయింపేమీ కాదు. 10 సంవత్సరాలుగా టీమిండియాకు ఆడుతున్న షమి.. అద్భుతమైన పెర్ఫార్మెన్స్​లతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్​లో ఏకంగా 24 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్​గా నిలిచాడు. తాజాగా తన కలను నెరవేర్చుకున్నాడీ వెటరన్ పేసర్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్నాడు షమి.

మన దేశంలో రెండో అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డును దక్కించుకున్నాడు షమి. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా మంగళవారం ఈ పురస్కారాన్ని అందుకున్నాడీ పేసర్. షమి అర్జున అవార్డును అందుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు షమి తాను అనుకున్నది సాధించాడని అంటున్నారు. ఎవరి అండదండలు లేకుండా సొంత ప్రతిభతో ఈ స్థాయికి ఎదిగాడని, ఈ పురస్కారానికి అతడు పూర్తిగా అర్హుడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈసారి అర్జున అవార్డుకు సెలక్ట్ అయిన క్రీడాకారుల్లో ఏకైక క్రికెటర్ షమీనే కావడం గమనార్హం. బీసీసీఐ ప్రత్యేక అభ్యర్థన మేరకు అతడి పేరు అవార్డుకు నామినేట్ అయింది. దీంతో భారత క్రికెట్ బోర్డును కూడా అభిమానులు మెచ్చుకుంటున్నారు. భారత జట్టుకు సింగిల్ హ్యాండ్​తో ఎన్నో విజయాలు అందించిన ప్లేయర్​ పేరును నామినేట్ చేయడం మంచి విషయమని చెబుతున్నారు.

shami achive his dream

అర్జున అవార్డు అందుకున్న సమయంలో షమి ఎమోషనల్ అయ్యాడు. ఈ అవార్డు సాధించడం తన కల అని.. మొత్తానికి దక్కిందన్నాడు. చాలా మంది ఆటగాళ్ల విషయంలో జీవితాలు గడిచిపోయినా ఈ పురస్కారం దక్కదని.. అలాంటిది తనకు దక్కినందుకు గర్వంగా ఉందన్నాడు. ఎంతో మంది క్రీడాకారులు అర్జున అవార్డును అందుకోవాలని ఎదురు చూస్తారని.. కానీ వీక్షకులుగానే మిగిలిపోతారన్నాడు. చాలా మందికి నెరవేరని కల ఇదని.. దీన్ని నిజం చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నాడు షమి. ఇంజ్యురీ గురించి కూడా ఈ వెటరన్ పేసర్ అప్​డేట్ ఇచ్చాడు. బెంగళూరులోని ఎన్​సీఏలో ఉంటూ ట్రైనింగ్ తీసుకుంటున్నానని చెప్పాడు. స్పీడ్​గా రికవర్ అవుతున్నానని.. త్వరలో ఇంగ్లండ్​తో జరిగే 5 టెస్టుల సిరీస్​ సమయానికి అందుబాటులో ఉంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే షమి పూర్తిగా కోలుకోకపోతే అతడ్ని పక్కన పెట్టొచ్చు. రికవర్ కాకుండా ఆడిస్తే గాయం తిరగబెట్టే ప్రమాదం ఉంది కాబట్టి అతడి విషయంలో బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. మరి.. షమి తన డ్రీమ్​ను నెరవేర్చుకోవడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్​ కుమార్ షాకింగ్ కామెంట్స్.. వాళ్లు తాగుబోతులంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి