iDreamPost

KL Rahul: వీడియో: రాహుల్​ కాళ్లకు మొక్కిన అభిమానులు.. స్టార్ ప్లేయర్ రియాక్షన్ వైరల్!

  • Published Jan 10, 2024 | 7:54 PMUpdated Jan 10, 2024 | 7:54 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్​కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తన బ్యాటింగ్ ప్రతిభతో ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నాడతను. అలాంటి రాహుల్​పై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఫ్యాన్స్.

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్​కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తన బ్యాటింగ్ ప్రతిభతో ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నాడతను. అలాంటి రాహుల్​పై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఫ్యాన్స్.

  • Published Jan 10, 2024 | 7:54 PMUpdated Jan 10, 2024 | 7:54 PM
KL Rahul: వీడియో: రాహుల్​ కాళ్లకు మొక్కిన అభిమానులు.. స్టార్ ప్లేయర్ రియాక్షన్ వైరల్!

ప్రస్తుత భారత జట్టులో అత్యంత ప్రతిభ కలిగిన క్రికెటర్లలో కేఎల్ రాహుల్ ఒకడని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. బాల్​ను అతడు టైమింగ్ చేసే విధానం, లేట్ షాట్స్, పేస్​తో పాటు స్పిన్​నూ అంతే ఈజీగా ఆడటం చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. క్లాసికల్ షాట్స్ ఆడుతూ ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లే రాహుల్ టీమిండియాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా కమ్​బ్యాక్ తర్వాత ఎక్స్​పెక్టేషన్స్​కు మించి పెర్ఫార్మ్ చేస్తున్నాడు. గాయంతో కొన్నాళ్లు టీమ్​కు దూరమైన ఈ స్టైలిష్ బ్యాటర్.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉండి ట్రీట్​మెంట్ తీసుకుంటూ తన టెక్నిక్​ను మార్చుకున్నాడు. దాని రిజల్ట్ గతేడాది జరిగిన ఆసియా కప్, వరల్డ్ కప్​లో కనిపించింది. మెగా టోర్నీలో అద్భుతంగా రాణించాడు రాహుల్. క్రమంగా తన ఫ్యాన్ ఫాలోయింగ్​ను పెంచుకుంటూ పోతున్నాడీ స్టైలిష్ బ్యాటర్. అయితే తాజాగా కొందరు ఫ్యాన్స్ రాహుల్​ కాళ్లకు మొక్కారు.

కేఎల్ రాహుల్​ కాళ్లకు కొందరు అభిమానులు మొక్కారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది. ఒక బిల్డింగ్ నుంచి బయటకు వస్తున్న రాహుల్​ను కొందరు ఫ్యాన్స్ చుట్టుముట్టారు. అతడితో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. అదే టైమ్​లో వారిలోని ఇద్దరు రాహుల్ పాదాలను టచ్ చేశారు. అయితే సడన్​గా కాళ్లకు మొక్కడంతో ఏం చేయాలో అర్థం కాని రాహుల్.. వాళ్లను వెంటనే పైకి లేపాడు. అలా చేయొద్దని కోరాడు. ఆ తర్వాత వాళ్లు అడిగినట్లే సెల్ఫీ దిగాడు. అనంతరం అభిమానులకు షేక్ హ్యాండ్స్ ఇచ్చి అక్కడి నుంచి తన కారులోకి ఎక్కి వెళ్లిపోయాడు. రాహుల్​ కాళ్లకు అభిమానులు మొక్కిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ పాజిటివ్​గా రియాక్ట్ అవుతున్నారు. తన కాళ్లకు నమస్కరించినా వెంటనే వారిని పైకి లేపాడని.. రాహుల్ సింప్లిసిటీకి ఇది నిదర్శనమని అంటున్నారు. అతడికి ఉన్న ఫాలోయిజం ఇదని కామెంట్లు పెడుతున్నారు.

కాగా, ఆఫ్ఘానిస్థాన్​తో జరగనున్న మూడు టీ20ల సిరీస్​కు రాహుల్​ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. వన్డేలతో పాటు టెస్టుల్లోనూ దుమ్మురేపుతున్న ఈ స్టార్ బ్యాటర్​కు మొండిచేయి ఎదురైంది. తాను ఏ పొజిషన్​లో ఆడేందుకైనా రెడీగా ఉన్నానని, కీపింగ్ కూడా చేస్తానంటూ ఈ సిరీస్​కు ముందు రాహుల్ చెప్పాడు. కానీ అతడి మాటల్ని పట్టించుకోని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో రాహుల్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. వికెట్లను కాపాడటంతో పాటు బిగ్ షాట్స్ కొట్టే సామర్థ్యం ఉన్న రాహుల్​ను ఇలా పక్కన పెట్టడం సరికాదని అంటున్నారు. సూపర్ ఫామ్​లో ఉన్న ఈ టాలెంటెడ్ బ్యాటర్​ను తీసుకోకుండా బీసీసీఐ తప్పు చేస్తోందని నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అభిమానులు అతడి కాళ్లకు మొక్కడంతో మళ్లీ వార్తల్లో నిలిచాడు రాహుల్. మరి.. రాహుల్​ కాళ్లకు ఫ్యాన్స్ మొక్కడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌పై క్రమశిక్షణా చర్యలు.. అందుకే టీమ్‌ నుంచి ఔట్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి