iDreamPost

Team India: గెలుపు జోష్ లో ఉన్న టీమిండియాకు గుడ్ న్యూస్! ఏకంగా..

కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది భారత్. దీంతో సిరీస్ ను 1-1తో సమం చేసుకుని చరిత్ర సృష్టించింది. కాగా.. గెలుపు జోష్ లో ఉన్న టీమిండియాకు మరో గుడ్ న్యూస్..

కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది భారత్. దీంతో సిరీస్ ను 1-1తో సమం చేసుకుని చరిత్ర సృష్టించింది. కాగా.. గెలుపు జోష్ లో ఉన్న టీమిండియాకు మరో గుడ్ న్యూస్..

Team India: గెలుపు జోష్ లో ఉన్న టీమిండియాకు గుడ్ న్యూస్! ఏకంగా..

దక్షిణాఫ్రికా గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాలని టీమిండియా అక్కడ అడుగుపెట్టింది. అందులో భాగంగా టీ20 సిరీస్ ను సమం చేసుకున్న భారత్.. వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని మంచి జోష్ లో ఉంది. ఇక ఇదే జోష్ ను టెస్ట్ సిరీస్ లో కూడా చూపించాలనుకున్న టీమిండియాకు తొలి టెస్ట్ లో ఊహించని షాకిచ్చింది సఫారీ టీమ్. ఇన్నింగ్స్ 32 రన్స్ తో భారత్ ను ఓడించింది. ఇక ఈ అపజయం నుంచి పుంజుకున్న టీమిండియా రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దీంతో సిరీస్ ను 1-1తో సమం చేసుకుని చరిత్ర సృష్టించింది. కాగా.. గెలుపు జోష్ లో ఉన్న టీమిండియాకు మరో గుడ్ న్యూస్..

కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై చరిత్రాత్మక విజయం సాధించింది. ఈ విజయంతో పలు రికార్డులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉండగా.. ఈ గెలుపుతో భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) 2023-2025 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. 54.16 శాతం పాయింట్లతో టీమిండియా ఐదో ప్లేస్ నుంచి ఏకంగా తొలి స్థానానికి దూసుకొచ్చింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో దారుణ ఓటమి చవిచూసిన సౌతాఫ్రికా జట్టు 50 శాతం పాయింట్లతో రెండో ప్లేస్ కు పడిపోయింది.

good news for team india

 

ఇక ఈ జాబితాలో కివీస్(50.0), ఆసీస్(50.0), బంగ్లాదేశ్(50.0) టీమ్స్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో ఒకవేళ ఆసీస్ విజయం సాధిస్తే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే? ఒక మ్యాచ్ లో గెలిస్తే.. 12 పాయింట్లు, డ్రా చేసుకుంటే 4 పాయింట్లు, మ్యాచ్ టై అయితే 6 పాయింట్ల పర్సంటేజీ ఉంటుంది. కాగా.. ఇటు విజయం సాధించి మంచి జోష్ లో ఉన్న టీమిండియాకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అగ్రస్థానంలోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి