iDreamPost

అసెంబ్లీ బాయికాట్ – తెలుగుదేశం కీలక నిర్ణయం ?

అసెంబ్లీ బాయికాట్ – తెలుగుదేశం కీలక నిర్ణయం ?

అసెంబ్లీ చివరి రోజు తెలుగుదేశం కీలక నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. మంగళగిరిలోని తెలుగుదేశం సెంట్రల్ ఆఫీసులో ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమై నేడు జరగబోయే అసెంబ్లీ కార్యక్రమాలను బహిష్కరించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది . నిన్న మండలిలో జరిగిన పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నాం అనే సాకు చూపి అసెంబ్లీ కార్యక్రమాలకు హాజరు కాకుండా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకునట్టు సమాచారం.

Read Also: రూల్ పాటించకపోవటం విచక్షణా?

మరో పక్క నిన్న మండలిలో జరిగిన పరిణామలను ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తుంది . తాడేపల్లిలోని తన నివాసంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తో భేటి అయి నిన్న మండలి చైర్మెన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించి దీనికి సంభందించి న్యాయ మరియు రాజ్యంగ పరమైన అంశాలపై సి.యం జగన్ చర్చిస్తునట్టు తెలుస్తుంది. అసెంబ్లీని ప్రరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకుని వచ్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి అనే అంశం పై ముఖ్యంగా చర్చిస్తునట్టు తెలుస్తుంది .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి