iDreamPost

టీడీపీ ఎంపీ కేశినేని హౌస్ అరెస్ట్

టీడీపీ ఎంపీ కేశినేని హౌస్ అరెస్ట్

రాష్ట్రంలో 3 రాజధానుల ప్రకటన రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చను రేకెత్తించింది. కొందరు 3 రాజధానులను సమర్థిస్తే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నాయకులు 3 రాజధానులను వ్యతిరేకిస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న రెండు మూడు గ్రామాల రైతులు మాత్రం అమరావతిలోనే రాజధాని ఉండాలని తమ నిరసనలు తెలియజేస్తున్నారు.

కాగా “అమరావతి పరిరక్షణ సమితి” ఆధ్వర్యంలో నేడు ధర్నా కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొనడానికి వీలులేకుండా టీడీపీ ఎంపీ కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తగా కేశినేని నానిని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొందరు రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో 3 రాజధానులకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేసే క్రమంలో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. శాంతిభద్రతలకు కూడా విఘాతం కలుగుతుంది. ధర్నా సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో ఎంపీ కేశినేనిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

రాజధానిని అమరావతి నుండి తరలించకుండా అక్కడే కొనసాగించాలని “అమరావతి పరిరక్షణ సమితి నేతలు” కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందినప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. కానీ రాజధాని పేరుతో అమరావతిలో గత ప్రభుత్వం టీడీపీ ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో అవకతవకలకుపాల్పడిందని అందుకే రాజధానిని అమరావతిలోని ఉంచాలని డిమాండ్ చేస్తూ 3 రాజధానులను వ్యతిరేకిస్తుందని పలువురు విమర్శిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి