iDreamPost

రెండో వివాహం చేయబోయిన టీడీపి నాయకులు చినరాజప్ప, యనమల

రెండో వివాహం చేయబోయిన టీడీపి నాయకులు చినరాజప్ప, యనమల

తెలుగుదేశం మాజీ మంత్రులు పెళ్ళి పెద్దల అవతారం ఎత్తారు, తెలుగుదేశం మాజీ శాసన సభ్యురాలి కుమారుడికి రెండో వివాహం దగ్గరుండి చేయబోయారు, మొదటి భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులను చూసి అక్కడనుండి జారుకున్నారు. వివారాల్లోకి వెళితే మాజీమంత్రి యనమల రామకృష్ణుడి స్వగ్రామం తొండంగి మండలం ఏవీ నగరంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి చిన్న కుమారుడు రాధా కృష్ణకు బుధవారం అర్ధరాత్రి రెండో వివాహం చేయతలపెట్టారు. అయితే, రాధాకృష్ణ ఇదివరకే 2011లో తనను పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరు పిల్లలు పుట్టాక తనను మోసంచేసి, ఇప్పుడు రెండో వివాహం చేసుకుంటున్నాడని సామర్లకోట మండలం మాధవపట్నానికి చెందిన పిల్లి మంజుప్రియ బుధవారం కాకినాడ ‘దిశ’ పోలీసులకు ఫిర్యాదు చెయగా పోలీసులు రంగంలోకి దిగడంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు అక్కడనుండి జారుకున్నారు.

తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడు రాధా కృష్ణ తనను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం చిత్రహింసకు గురిచేసి వదిలేసినట్లు భార్య పిల్లి మంజుప్రియ ఇంద్రపాలెం పోలీసు స్టేషన్లో ఈ ఏడాది మార్చ్ నెలలో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. 2011లో రాధాకృష్ణతో ప్రేమవివాహమైందని, కానీ కొన్ని రోజులుగా రాధాకృష్ణ కుటుంబం తనను మానసికంగా వేధిస్తున్నారని, తాను ఎస్సీ కులానికి చెందడంతో కులంపేరుతో దూషిస్తున్నారని చేసిన ఫిర్యాదు మేరకు అప్పుడే ఇంద్రపాలెం ఎస్‌ఐ నాగార్జున తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కుటుంబంపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, గృహహింస కేసు కింద పిల్లి రాధాకృష్ణను ఎ1 గానూ, పిల్లిసత్యనారాయణ మూర్తి ఎ2, పిల్లి అనంతలక్ష్మి ఎ3, పిల్లి కృష్ణప్రసాద్‌ను ఎ4గా నమోదుచేశారు.

ఇదే విదంగా రెండు నెలల క్రిందట కూడా మాజీ శాసన సభ్యురాలు బాధితురాలికి డబ్బు ఆశ చూపి తిరుపతిలో తన కుమరుడికి పెళ్ళి చేయబోగా ఆమే అడ్డుకునట్టు తెలుస్తుంది. ఇక తాజాగా కేసులు వరకు వెళ్ళిన ఈ వ్యవహారం లో మాజీ మంత్రులు తల దూర్చి తోటి శాసన సభ్యురాలి కుమారుడికి చట్టవ్యతిరేకంగా దగ్గరుండి పెళ్ళి చేయబోయేసరికి విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసుల సహాయంతో అడ్డుకునే ప్రయత్నం చేయగా విషయం మీడియా వరకు వ
వెళ్లడంతో మాజీ మంత్రులు అక్కడనుండి జారుకునట్టు తెలుస్తుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి