iDreamPost

తెలంగాణలో టీడీపీ, జనసేన విచిత్ర వ్యూహం! ఫ్యాన్స్ ఫైర్!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణాలో  ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అలానే ఏపీలో మరికొద్ది  నెలల్లో  ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తుల విషయం చర్చకు వస్తుంది. పొత్తులు పెట్టుకోవడం అనేది ఎన్నికల్లో సర్వసాధారణం. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు పార్టీలు తెలంగాణలో విచిత్రంగా ఉన్నాయని టాక్. ఆ రెండు పార్టీల్లో ఓ పార్టీ పొత్తు, మరోక పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంపై రాజకీయ విశ్లేషకు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణాలో  ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అలానే ఏపీలో మరికొద్ది  నెలల్లో  ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తుల విషయం చర్చకు వస్తుంది. పొత్తులు పెట్టుకోవడం అనేది ఎన్నికల్లో సర్వసాధారణం. ఇప్పటి వరకు అనేక పార్టీలు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్లాయి. అయితే  తాజాగా తెలంగాణ, ఏపీలో ఉన్న పొత్తులు అందరికి ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి. ముఖ్యంగా జనసేన, టీడీపీ పొత్తుల వ్యవహారం చాలా విచిత్రంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.

2024 లో ఏపీలో జరగనున్న ఎన్నికల్లో  టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్న విషయం తెలిసిందే.  ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా తెలిపారు. ఈ క్రమంలోనే వారి వ్యూహాలు, ఉమ్మడి కార్యాచరణపై కసరత్తులు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తెలంగాణలో వారి పొత్తుల, రాజకీయ వ్యూహాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. కారణం.. ఏపీలో కలిసి పోటీకి వెళ్లనున్న ఈ రెండు పార్టీలు,  తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేస్తుండగా, టీడీపీ మాత్రం ఏకంగా ఎన్నికలకు దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా తెలంగాణ టీడీపీ నేతలు లోలోపల కోపంతో ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేయాలని చాలా మంది భావిస్తే.. వారి ఆశలపై అధిష్టానం నీరు చల్లింది.  అందుకే టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు జనసేన సైతం 32 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పి.. ఇప్పుడు కేవలం 9 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలుస్తోంది. ఇలా రెండు పార్టీలు తీసుకున్న నిర్ణయాలతో ఆ పార్టీల నేతలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన బీజేపీ వైపు ఉంది.. మరీ టీడీపీ ఎవరి కోసం పోటీ చేయడం లేదు అనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కోసమే టీడీపీ పోటీ చేయడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇటు బీజేపీతో జనసేన ఉండి, టీడీపీ కాంగ్రెస్ వైపు ఉంటే.. భవిష్యత్తు ఏపీ రాజకీయాల్లో అవకాశాన్ని బట్టి వాటిని వినియోగించుకునే ఆలోచనలో ఆ రెండు పార్టీలు ఉన్నట్లు పొలిటికల్ టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, సెంట్రల్ లో బీజేపీ అధికారంలోకి వచ్చినా.. జనసేన ప్రత్యక్షంగా, టీడీపీ పరోక్షంగా చెరో వైపు ఉన్నారు కాబట్టి… భవిష్యత్తులో ఏదైనా అవసరం వస్తే.. ఇరువైపుల నుంచి సాకారం లభిస్తుందనే భావనలో జనసేన, టీడీపీ ఉన్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇలా ఈ రెండు పార్టీల విచిత్ర వ్యూహాలకు, ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి.. ఈ విచిత్ర వ్యూహాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి