iDreamPost

బిఏసి సాక్షిగా బయటపడ్డ టిడిపి డ్రామాలు

బిఏసి సాక్షిగా బయటపడ్డ టిడిపి డ్రామాలు

రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు మొదలైన సందర్భంగా ఉదయం బిఏసి సమావేశం జరిగింది. బిఏసి సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, సభలో చర్చించాల్సిన అంశాలేమిటి ? బిల్లులు తదితరాలన్నింటిపైనా అధికార, ప్రతిపక్షాల నేతలు ఓ నిర్ణయానికి వస్తారు. అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతనే ఈ సమావేశం జరుగుతుంది. అంటే ఇంతటి కీలకమైన సమావేశంలో టిడిపి చీప్ పాలిటిక్స్ బయటపడింది.

ఉదయం బిఏసి సమావేశంలో టిడిపి తరపున పాల్గొన్న నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వర్చువల్ పద్దతిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశాడు. సభలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్న కారణంగా ఎక్కువరోజులు వర్కువల్ టెక్నాలజీలో సమావేశాలు జరపాలంటూ పట్టుబట్టాడు. అయితే అక్కడే ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వర్చువల్ పద్దతిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ సాధ్యంకాదని తేల్చేశాడు. ఈ విషయంలో పార్లమెంటు సమావేశాల నిర్వహణపైనే ఇంత వరకు కేంద్రం నిర్ణయం తీసుకోని విషయాన్ని కూడా గుర్తు చేశాడు.

కాకపోతే టిడిపి డిమాండ్ ప్రకారం వర్చువల్ పద్దతిలో కాకుండా నేరుగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టంగా చెప్పాడు. టిడిపి కోరుకున్నట్లుగా ఎన్ని రోజులైనా పర్వాలేదని 50 రోజులైనా సరే అసెంబ్లీ నిర్వహణకు వెనక్కు తగ్గేది లేదంటూ జగన్ చెప్పిన మాటలు వినగానే రామానాయుడు నోట మాటరాలేదు. గడచిన ఏడాది కాలంలో 3.98 కోట్లమంది లబ్దిదారులకు ప్రభుత్వం నుండి అందిన సంక్షేమ పథకాలపై ప్రభుత్వం చెప్పుకోవాల్సింది చాలా ఉందన్నాడు జగన్.

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అసెంబ్లీని నిర్వహించే పరిస్ధితులు లేవన్న విషయం అందరికీ తెలుసు కాబట్టే రెండు రోజులు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. కాదు కూడదని టిడిపి పట్టుబడితే ఎన్ని రోజులైనా సరే అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తాము సిద్ధమే అంటూ జగన్ విసిరిన చాలెంజ్ కు రామానాయుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. కొద్దిసేపు సమావేశంలోనే కూర్చుని జగన్ చాలెంజ్ కు ఏమీ సమాధానం చెప్పకుండానే లేచి వెళ్ళిపోయాడు. కొసమెరుపేమిటంటే జగన్ అడిగినపుడు ఏమీ సమాధానం చెప్పని రామానాయుడు బయటకు వచ్చి మీడియాతో మాత్రం 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేయటం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి