iDreamPost

ఆరోపణ చేస్తే అతికినట్లుండాలి ఉమా..!

ఆరోపణ చేస్తే అతికినట్లుండాలి ఉమా..!

రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు సహజం. ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాలని విమర్శలు, ఆరోపణలు చేయడం సర్వసాధారణం. అయితే అవి ప్రత్యర్థులను ఇరుకునపెట్టకపోగా.. ఒక్కొసారి అవి చేసిన వారినే నవ్వులపాలుచేస్తాయి. సీఐడీ విచారణ తర్వాత టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు కూడా ఈ కోవకే వస్తాయి.

చంద్రబాబు పేరు చెబితే నన్న వదిలేస్తానని సీఐడీ అధికారులు చెప్పారు. నాపై ఒత్తిడి తెచ్చారు. ప్రజా బాహుల్యంలో ఉన్న వీడియోను ప్రదర్శించడం తప్పా.. నేను ఏ తప్పు చేయలేదు. అక్రమ కేసులు పెట్టారు.. అంటూ దేవినేని ఉమా మీడియా ముందు ఏకరవు పెట్టారు. ఈ వ్యాఖ్యలతోనే దేవినేని పాత చింతకాయ పచ్చడి రాజకీయం చేశారని అర్థమవుతోంది.

22 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉన్నానంటూ చెప్పిన దేవినేని.. ఏ మాత్రం లాజిక్‌ లేకుండా సీఐడీ అధికారులపై ఆరోపణలు చేశారు. ఓ సాధారణ టీడీపీ కార్యకర్త మాదిరిగా మాట్లాడారు. తాను మాజీ మంత్రిని అని, చంద్రబాబు పేరు చెప్పాలని సీఐడీ అధికారులు తనపై ఒత్తిడి తెస్తారా..? లేదా..? ఒత్తిడి చేశారని చెబితే.. ప్రజలు నమ్ముతారా..? అనే కనీసం ఆలోచన కూడా లేకుండా దేవినేని విమర్శలు చేయడంతో టీడీపీ శ్రేణులే నవ్వుకుంటున్నాయి.

Also Read : చంద్ర‌బాబు దిద్దు”బాట” ప‌డుతున్నారా..?

ఓ పక్క చంద్రబాబు పేరు చెబితే వదిలేస్తామంటూ సీఐడీ అధికారులు ఒత్తిడి చేశారంటున్న దేవినేని.. అదే సమయంలో తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. అక్రమకేసులన్నారు. అక్రమ కేసులైతే.. అవి నిలబడవు. అలాంటిది చంద్రబాబు పేరు చెప్పాలని సీఐడీ అధికారులు ఎందుకు ఒత్తిడి చేస్తారు..? అనే లాజిక్‌ను దేవినేని మిస్‌ అయ్యారు.

తాను ఏ తప్పు చేయలేదు, ప్రజా బాహుళ్యంలో ఉన్న వీడియోను ప్రదర్శించానని కూడా దేవినేని చెప్పారు. మరి అలాంటప్పుడు సీఐడీ విచారణను తప్పించుకునేందుకు ఎందుకు యత్నించారనే ప్రశ్న సామాన్యుల్లోనూ కలుగుతుంది. సీఐడీ రెండు సార్లు నోటీసులు ఇస్తే స్పందించని దేవినేని.. మూడో నోటీసు ఇచ్చేందుకు ఇంటికి వస్తే.. పరారయ్యారు. మరి ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు పరారయ్యారనే ప్రశ్నకు దేవినేని సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

తనను అరెస్ట్‌ చేయొద్దంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. తప్పు చేయనప్పుడు అరెస్ట్‌ చేస్తారని ఎందుకు భయపడతారు..? అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది..? తప్పు చేయనివాడు ఎవరైనా నిర్భయంగా విచారణను ఎదుర్కొంటారు. తప్పు చేసినప్పుడే తప్పించుకునేందుకు యత్నిస్తారన్నది జగమెరిగిన సత్యం. ఇది దేవినేని ఒక సారి గుర్తు చేసుకుని ఉంటే నవ్వులపాలుకాకుండా ఉండేవారు.

Also Read : తప్పించుకుందామనుకున్నా తప్పలేదు – దేవినేని

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి