iDreamPost

బాబు సేవలో తరించేదెలా..జనసేన కీలక నిర్ణయాలు?

బాబు సేవలో తరించేదెలా..జనసేన కీలక నిర్ణయాలు?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. చంద్రబాబు అరెస్ట్ ముందు వరకు అధికారికంగా జనసేన, టీడీపీ వేరు వేరుగా తమ పార్టీ కార్యకలాపాలు సాగించాయి. అయితే చంద్రబాబు అరెస్ట్ తరువాత రాజకీయ ముఖ చిత్రం మారింది.  జనసేన,టీడీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన నేతలు, ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ చంద్రబాబు సేవలో తరించేలా ప్రణాళికాలు సిద్ధం చేస్తున్నట్లు పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి.  ఆ విధంగా టాక్ రావడానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయని కొందరు అభిప్రాయా పడుతున్నారు.

చంద్రబాబు అరెస్టు అయిన తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బాబును కలిసిన అనంతరం మీడియాతో తమ పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తరువాత నుంచి పవన్ కల్యాణ్ కనిపించిన దాఖాలాలులేవు. అయితే  పవన్ తరపున చంద్రబాబు నాయుడుకి సాయం చేసేదెలా? పార్టీ శ్రేణులను మొత్తాన్ని చంద్రబాబు కోసం ఉపయోగించే వ్యూహ రచన  చేసే బాధ్యతను నాదెండ్ల మనోహార్ స్వీకరించారని వైసీపీ నేతలు అంటున్నారు.  అందుకే  రెండు రోజుల క్రితమే  నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జనసేన పార్టీ మీటింగ్ జరిగింది.

ఈ సమావేశంలో టీడీపీతో కలిసి ఉమ్మడిగా ఎలాంటి ప్రజా పోరాటలను నిర్వహించాలి అనే దిశగా సమాలోచనలు జరపడానికి, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తీసుకున్నాడు. అలానే మరికొన్ని సమావేశాలు నిర్వహించేందుకు సిద్దమయ్యాడు. ఇదే సమయంలో వారాహి యాత్రను  ఏ విధంగా విజయవంతం  చేయాలని? అనే దిశగా కూడా  ఆయన పార్టీ నాయకులతో సమాలోచనలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు పల్లకి మోయడం, ఆయన సేవలో అతిగా తరిస్తున్నట్లుగా కనిపించడం నాదెండ్ల మనోహర్ కే అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అందుకు బలమైన కారణం కూడా ఉందని పొలిటికల్ ఎనలిస్ట్ లు కొన్ని విషయాలు వ్యక్తం చేస్తున్నారు.  నాదెండ్ల మనోహర్ తెనాలిలో తప్ప మరో నియోజకవర్గంలో పోటీ చేయలేరు. తెనాలిలో  ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

అయితే అక్కడ టీడీపీ బలమైన అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే ఆలపాటి రాజా  ఉన్నారు. ఆయనకు చెక్ పెట్టేందుకే నాదెండ్ల ఇలా పవన్ కల్యాణ్ కంటే, చంద్రబాబునే ఎక్కువ ప్రసన్నం చేసుకోవడం ముఖ్యమే భావనలో ఉన్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే చంద్రబాబు సేవలో తరించేదెలా? అని నాదెండ్ల మనోహార్ సమాలోచనలు చేస్తోన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి.. చంద్రబాబు కోసం జనసేన కార్యకర్తలను వాడుకుంటున్నారని వినిపిస్తోన్న వార్తలపై మీ అభిప్రాయాలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి