iDreamPost

చంద్రబాబు లాయర్లే ఆయన్ని బయటకి రానివ్వడం లేదా?

చంద్రబాబు లాయర్లే ఆయన్ని బయటకి రానివ్వడం లేదా?

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చం‍ద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ స్కాం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. చంద్రబాబుకు అడుగడుగునా చుక్కెదురవతూ వస్తోంది. బెయిల్‌ కోసం ఆయన ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అక్టోబర్‌ 4వ తేదీకి వాయిదా పడింది. అంతేకాదు! సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌కు సంబంధించిన విచారణ కూడా వాయిదా పడింది.

సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో బుధవారం రోజున బాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు లాయర్లు ఫీల్‌ ఫ్రీగా ఉన్నారు. వారు ఇలా ఉండటం వెనుక వ్యూహాత్మకమైన వ్యవహారం ఉందని తెలుస్తోంది. ఓ పక్కా పథకంతోనే వారు ఈ విధంగా చేస్తున్నట్లు సమాచారం. పైకోర్టుల్లో పిటిషన్‌ల మీద పిటిషన్‌లు వేయటం ద్వారా చంద్రబాబు కస్టడీని ఆపటమే వారి లక్ష్యంగా తెలుస్తోంది. 17 ఏ ను కొట్టించే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

సుప్రీంకోర్టులో 17 ఏ ను కొట్టించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు లాయర్‌ సిద్ధార్థ్‌ లూద్రా పైనుంచి అంతా నడిపిస్తున్నారని సమాచారం. ఏపీ సీఐడీ వరుస కేసుల్తో సిద్ధంగా ఉన్న నేపథ్యంలో.. స్కిల్‌ స్కాంలో అరెస్ట్‌ చేయడానికి 17 ఏ కింద పర్మిషన్‌ తీసుకోలేదు కాబట్టి.. ఆ కేసును కొట్టేస్తే సుప్రీం కోర్టు కొట్టేస్తే.. తర్వాత ప్రతీ కేసుకు సంబంధించి 17 ఏ కింద పర్మీషన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. పీటీ వారెంట్లతో పాటు ఏవీ వర్తించవు. అందుకనే పీటీ వారెంట్ల మీద తమ వాదనలు వినిపించకుండా వారు ఆపుతున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు లాయర్లు ఎంతో వ్యూహాత్మకం కథను నడుపుతున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టులో బలంగా ఈ మేరకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును పూర్తిగా బయటపడేయాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ప్రముఖ జర్నలిస్ట్‌ సాయి కూడా వెల్లడించారు. చంద్రబాబు లాయర్లు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మరి, సుప్రీంకోర్టు లక్ష్యంగా చంద్రబాబు లాయర్లు పావులు కదుపుతున్నారన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి