iDreamPost

దీదీ సర్కారుపై టాటా విజయం! రూ.766 కోట్లు పరిహారం చెల్లించాలని తీర్పు!

దేశంలో దిగ్గజ ఆటో మొబైల్స్ సంస్థ టాటా. ఈ సంస్థ పలు సంచనాలకు కేంద్ర బిందువైంది. కారు కొనాలన్న సామాన్యుడి కలలను నెరవేర్చింది. నానో కారుతో ఎంత మంది తమ కలను నెరవేర్చుకున్నారు. కానీ ఈ ప్రయాణంలో సదరు సంస్థకు ఎదురు దెబ్బలు తగిలాయి. ఇప్పుడు ఆ ఫలితం దక్కింది.

దేశంలో దిగ్గజ ఆటో మొబైల్స్ సంస్థ టాటా. ఈ సంస్థ పలు సంచనాలకు కేంద్ర బిందువైంది. కారు కొనాలన్న సామాన్యుడి కలలను నెరవేర్చింది. నానో కారుతో ఎంత మంది తమ కలను నెరవేర్చుకున్నారు. కానీ ఈ ప్రయాణంలో సదరు సంస్థకు ఎదురు దెబ్బలు తగిలాయి. ఇప్పుడు ఆ ఫలితం దక్కింది.

దీదీ సర్కారుపై టాటా విజయం!  రూ.766 కోట్లు పరిహారం చెల్లించాలని తీర్పు!

దేశంలో దిగ్గజ వ్యాపార సంస్థల్లో ఒకటి టాటా. ఆటో మొబైల్ రంగం నుండి వివిధ రంగాల్లో దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఈ సంస్థ సంచలనాలకు కూడా కేంద్ర బిందువైంది. ఎలా ఉంటే సామాన్యుడు కూడా కొనగలిగేంతలా.. టాటా నానో కారు ప్రాజెక్ట్‌ను తీసుకువచ్చింది. దీంతో సొంత కారు ఉండాలన్న మధ్యతరగతి కుటుంబాల కళను నెరవేర్చింది. కేవలం లక్ష ప్రారంభ ధరతో నానో కారును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. అయితే ఈ కార్లకు డిమాండ్ పడిపోవడంతో 2019లో నానో ఉత్పత్తిని టాటా మోటార్స్ నిలిపివేసింది. 2020 నుండి నానో కార్ల సేల్స్ ఆగిపోయాయి. అయితే ఇప్పుడు ఈ సంస్థ రూ. 766 కోట్ల భారీ పరిహారం అందుకోనుంది. మమతా బెనర్జీ ప్రభుత్వంపై పై చేయి సాధించింది.

అసలు ఏమైందంటే..2007-08లో సింగూర్‌లో నానో కార్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు టాటా మోటార్స్ రూ. 1000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. దీని కోసం 13 వేల మంది రైతుల నుండి వెయ్యి ఎకరాల భూమిని సేకరించారు. అయితే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేసింది. నిరసన చేపట్టింది. దీంతో ప్రాజెక్టును నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో టాటా సంస్థ భారీ నష్టాన్ని చవి చూసింది. ఆ ఫ్లాంట్‌ను గుజరాత్‌లోని సనంద్ అనే ప్రాంతానికి మార్చింది. ఇదే సమయంలో ఈ విషయంపై కోర్టు మెట్లెక్కింది టాటా సంస్థ. విచారణ చేపట్టిన కోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని తేల్చి చెప్పింది.

ఆ నష్టాలను పశ్చిమ బెంగాల్ ఇండస్ట్రీయల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చెల్లించాలని ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ఆదేశించింది. పెట్టుబడులకు 11 శాతం వార్షిక వడ్డీతో పాటు రూ. 765.78 కోట్ల మొత్తాన్ని రికవరీ చేసుకునే అర్హత టాటా మోటార్స్‌కు ఉందని పేర్కొంది. అయితే ఇప్పుడు 2016 సెప్టెంబర్ నుండి పరిహారం చెల్లించే తేదీ వరకు లెక్కిస్తారు. దీంతో టాటా సంస్థ ఇప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై టాటా సంస్థ విజయం సాధించినట్లు అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి